దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే ఢీల్లీకి సరిహద్దున ఉన్న 14 జిల్లాల్లో కాకర్స్ కాల్చొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఢీల్లీ సమీప జిల్లాల్లో కాలుష్యం పెరిగిపోతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాకర్స్ను కాల్చుకోవాలనుకుంటే కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కాల్చొచ్చు, కానీ అవికూడా గ్రీన్ కాకర్స్ అయి ఉండాలని హర్యానా ప్రభుత్వం పేర్కొంది.
గత నెలలో ఢీల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ(డీపీసీసీ) కాకర్స్ కాల్చాడాన్ని పూర్తిగా నిషేధించింది. జనవరి 1, 2022 వరకు కాకర్స్ కాల్చాడాన్ని ఆపేయాలని కోరింది. దీంతో కాలుష్యం పెరగకుండా కొంచెం అయినా తగ్గుతుందని డీపీసీసీ కోరింది. కేవలం 50 లైసైన్స్డ్ దుకాణాలకు మాత్రమే దీపావళి టపాసులు అమ్మడానికి ఢీల్లీ హైకోర్టు శనివారం అనుమతులు ఇచ్చింది. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే కాకర్స్ కాకుండా కేవలం గ్రీన్ కాకర్స్ను మాత్రమే కాల్చుకోవాలని తెలిపింది.