స్నేహితులతో సరాదాగా కాసిన పందెం ప్రాణాల మీదకు తెచ్చింది. దీపావళి రాత్రి (అక్టోబర్ 31) బెట్టింగ్ ఛాలెంజ్‌లో భాగంగా శక్తివంతమైన బాణాసంచాపై కూర్చున్నాడు. ఒక్కసారి పేలడంతో ప్రాణాలు పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
Tamilnadu : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నజరేత్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీ గోదాములో శనివారం సాయంత్రం జరిగిన పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఇద్దరు మహిళలు సహా నలుగురు గాయపడ్డారు.
Tamilnadu: తమిళనాడులోని మైలాడుతురై జిల్లా తరంగంబాడి తాలూకాలోని తిలయాడి గ్రామంలో బుధవారం బాణాసంచా తయారీ యూనిట్, గోదాములో జరిగిన పేలుడులో నలుగురు వ్యక్తులు మరణించారు.
బాణా సంచాను ఈఏడాది పూర్తిగా నిషేధించాలని కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పర్యావరణానికి హాని కలుగకుండా ఉండేందుకు టపాసులను దిగుమతి చేసుకోవాలని దీనిపై బెంగాల్ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించింది. బేరియం లవణాలు ఉన్న బాణాసంచాపై ఇటీవలే నిషేధం విధించింది సుప్రీం కోర్టు. హరిత టపాసులకు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు లేవని సుప్రీం కోర్టు తెలిపింది. ఇప్పటికే బాణాసంచా కాల్చడంపై ఆయా రాష్ట్రాల్లో నిషేధం ఉంది. ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో…
దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే ఢీల్లీకి సరిహద్దున ఉన్న 14 జిల్లాల్లో కాకర్స్ కాల్చొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఢీల్లీ సమీప జిల్లాల్లో కాలుష్యం పెరిగిపోతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాకర్స్‌ను కాల్చుకోవాలనుకుంటే కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కాల్చొచ్చు, కానీ అవికూడా గ్రీన్ కాకర్స్ అయి ఉండాలని హర్యానా ప్రభుత్వం పేర్కొంది. గత నెలలో ఢీల్లీ పొల్యూషన్…
దీపావళి పండుగ వచ్చేస్తోంది.. ఇంటిల్లిపాది కలిసి ఉత్సాహంగా టపాసులు కాల్చుతూ సంతోషంగా గడుపుతారు.. అయితే, రోజురోజుకీ పెరుగోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు గత కొన్నేళ్లుగా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కోర్టులు, ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి.. దీపావళి రోజు పెద్ద ఎత్తున ధ్వని, వాయుష్య కాలుష్యం నమోదు అవుతుండడంతో.. కాలుష్య నియంత్రణ మండలి చర్యలను పూనుకుంది. ఇక, ఏపీలో దీపావళి పండుగ రోజు రాత్రి 8-10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది……