Formula E Race: ఆహా.. స్టార్ హీరోల సతీమణులు.. పతులు లేకుండానే వచ్చారే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Formula E Race: అంతర్జాతీయ మోటార్ కార్ రేసింగ్ సంస్థ (ఎఫ్‌ఐఏ) ఎలక్ట్రికల్ కార్లతో తొలిసారి ఫార్ములా ఈ-వరల్డ్ చాంపియన్‌షిప్ హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ నెల 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్ ను నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఈ ఫార్ములా ఇ రేసింగ్ ప్రమోషన్స్ కోసం సినీతారలు దిగివచ్చి అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నారు. ఇక రెండు రోజుల క్రితమే సంగీత దర్శకుడు థమన్ సంగీత సారథ్యంలో ఫార్ములా ఇ రేసింగ్ ప్రమోషన్ సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నాడు. ఇక తాజాగా హైదరాబాదులో ఫార్ములా-ఇ రేసింగ్ ట్రాక్ ను టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు సందర్శించారు. మహేష్ బాబు భార్య నమ్రత, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా సందడి చేశారు.
Ananya Pandey: ఉఫ్.. విప్పి చూపించడం కాదు.. యాక్టింగ్ కూడా నేర్చుకో
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
ఇక ఈ సందర్భంగా మహేష్ భార్య నమ్రత మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఫార్ములా ఇ రేసింగ్ నిర్వహించడం గ్రేట్ అని చెప్పుకొచ్చింది. తానెప్పుడు ఫార్ములా ఇ రేసింగ్ హైదరాబాద్ లో చూడలేదని, ఇదే మొదటిసారి అని తెలిపింది. తనకు రేసింగ్ పెద్దగా ఇష్టముండదని, తన కొడుకు గౌతమ్ కు బాగా ఇష్టమని చెప్పిన నమ్రత సంవివరం ఈ రేసింగ్ చూడడానికి గౌతమ్ కూడా వస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక మహేష్ బాబు ఊర్లో లేని కారణంగా ఆయన రాలేకపోతున్నట్లు చెప్పుకొచ్చింది. మరోపక్క ఈ ముగ్గురు సతీమణులు.. పతులు లేకుండా రావడం విశేషం. ముఖ్యంగా తారక్ భార్య ప్రణతి.. తారక్ లేకుండా ఆమె బయట ఎక్కువ కనిపించదు. వీరు ముగ్గురు ముచ్చట్లు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి శనివారం ఈ రేసింగ్ లో ప్రముఖులు ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.
హైదరాబాదులో ఫార్ములా-ఇ రేసింగ్ ట్రాక్ ను సందర్శించిన నారా బ్రాహ్మణి, లక్ష్మీ ప్రణతి, నమ్రత శిరోద్కర్ ..#LakshmiPranathi #NaraBrahmani #NamrataShirodkar #MaheshBabu #JrNTR #NaraLokesh #Hyderabad #HyderabadEPrix #HyderabadEMotorShow2023 #KTR #Telangana #NTVTelugu pic.twitter.com/vUhZXtnx8d
— NTV Telugu (@NtvTeluguLive) February 10, 2023
మహేశ్ బాబు హైదరాబాదులో లేరు… అందుకే హైదరాబాదులో ఫార్ములా-ఇ రేసింగ్ కు రావడంలేదు: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత శిరోద్కర్ #MaheshBabu #NamrataShirodkar #Hyderabad #HyderabadEPrix #HyderabadEMotorShow2023 #KTR #Telangana #NTVTelugu pic.twitter.com/2ASV0DRBoS
— NTV Telugu (@NtvTeluguLive) February 10, 2023
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!