CM Himanta Biswa Sarma.. Bulldozer Action In Assam: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. మదర్సాలు కేంద్రంగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అస్సాం పోలీసులు గుర్తించి.. వరసగా అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నదీకి అటూఇటూగా బంగ్లాదేశ్ ను అనుకుని ఉన్న జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి అక్రమంగా చొరబడి పలు మదర్సాల్లో ఉగ్రశిక్షణ ఇస్తున్నారు. అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్రవాదులను ప్రణాళికలను భగ్నం చేశారు అస్సాం పోలీసులు. కొన్ని అక్రమ మదర్సాలు నిర్వహణపై ప్రభుత్వ కొరడా ఝుళిపించింది. మదర్సాలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఆదేశించింది.
Read Also: MLA Raja Singh: రేపటితో ముగియనున్న బీజేపీ డెడ్లైన్.. గడువు కోరిన రాజాసింగ్ భార్య
ఇదిలా ఉంటే భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే మదర్సాలను కూల్చివేస్తామని.. సీఎం హిమంత బిశ్వ శర్మ స్ట్రాంగ్ హెచ్చరిక జారీ చేశారు. బుధవారం బొంగైగావ్ జిల్లాలో ‘జీహాదీ’ కార్యక్రమాలకు ఉపయోగించిన మదర్సా భవనాన్ని అధికారులు కూల్చివేసిన తర్వాత ఈ ప్రకటన చేశారు. మదర్సాలను కూల్చివేసే ఉద్దేశ్యం మాకు లేదని.. అయితే జీహాదీలు ఉపయోగించుకుండా చూడాలనే ఉద్దేశ్యం మాత్రమే ఉందని బిశ్వ శర్మ అన్నారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం వస్తే.. మేము వాటిని తప్పకుండా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
అంతకుముందు బంగ్లాదేశ్ వ్యక్తులకు నాలుగేళ్లుగా ఆశ్రయం కల్పించిన బార్ పేట జిల్లాలోని మదర్సాను సోమవారం అధికారులు కూల్చివేశారు. మంగళవారం రాత్రి గోల్ పరా పోలీసులు జరిపిన ఆపరేషన్ లో జీహాదీ అంశాలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సంబంధం ఉన్న మదర్సా టీచర్లు, ఇతర వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత ఉపఖండంలో అల్ ఖైదాకు సంబంధించి ఐదు మాడ్యుళ్లను అస్సాం పోలీసులు ఛేదించారు. బంగ్లాదేశీయులతో సహా జీహాదీ సంబంధాాలు ఉణ్న అనుమానిత వ్యక్తులను 40 మందికి పైగా మందిని మార్చి నుంచి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.