Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- ఎలాంటి బాండ్‌పై సంతకం చేయలేదు..
- మళ్లీ వీధుల్లోకి వస్తాం..
- సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) మరోసారి వీధుల్లోకి వస్తామని ప్రకటించింది. అక్టోబర్ 10న ఢిల్లీలో నిరసన సందర్భంగా విమానం నుంచే సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే, కోకన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం వీరిని ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రూ. 50,000 పూచీకత్తుతో కూడిన బెయిల్ బాండ్‌పై వీరిని విడుదల చేసినట్లు మీడియా నివేదించింది.
కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని సీజేపీ లీగర్ హెడ్ రత్నా సింగ్ చెప్పింది. ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదనే షరతుతో కోర్టు దీప్కే, రాంకా, దాస్‌లను విడుదల చేసినట్లు సీజేపీ న్యాయవాది తెలిపారు. బీఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 126 (శాంతికి భంగం కలిగించడం), సెక్షన్ 170 (గుర్తించదగిన నేరం జరగకుండా నిరోధించడానికి అరెస్టు చేయడం) కింద పోలీసులు వారిపై చర్య తీసుకున్నారు.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ఇదిలా ఉంటే, ఇప్పుడు అభిజిత్ దీప్కే సంచలన ప్రకటన చేశారు. సీజేపీ ఎలాంటి నిరసన తెలపదని తెలిపే ఎలాంటి బాండ్పైనా సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ‘‘మేము మళ్లీ వీధుల్లోకి వస్తాం’’ అని ట్వీట్ చేశారు. తాము నిరసన తెలుపబోమనే ఎలాంటి బాండ్పైన సంతకం చేయలేదని స్పష్టం చేశారు.
Haven’t signed any bond that says we won’t protest. We will hit the streets again.
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 11, 2026
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..