CJI Surya kant: సీజేపీ నిరసనల పిటిషన్‌పై సూర్యకాంత్ కీలక ప్రకటన
- సీజేపీ నిరసనల పిటిషన్‌పై సూర్యకాంత్ కీలక ప్రకటన
- ఈ విషయంలో మీడియా తప్పుడు ప్రచారం చేసింది
- అసలు పిటిషనే దాఖలు కాలేదన్న చీఫ్ జస్టిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరాకరించారంటూ పెద్ద ఎత్తున మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. దీంతో సీజేఐపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ వ్యవహారంపై సీజేఐ సూర్యకాంత్ కీలక వివరణ ఇచ్చారు. సీజేపీ నిరసనల కేసు విచారించేందుకు నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు. అసలు ఆ అంశంపై ఇప్పటివరకు సుప్రీంకోర్టులో ఎలాంటి పిటిషన్ కూడా దాఖలు కాలేదని వెల్లడించారు.

Also Read
- Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..
- CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
- Abhijeet Dipke: వాంగ్‌చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
సుప్రీంకోర్టులో కేసుల ప్రస్తావన సమయంలో ఈ అంశంపై సీజేఐ స్పందించారు. కొంతమంది మీడియా సంస్థలు తాను పిటిషన్‌ను విచారణకు తీసుకోలేదని తప్పుగా ప్రచారం చేశారని వాపోయారు. ‘‘ఒక వ్యక్తి కేవలం ప్రాతినిధ్య పత్రం మాత్రమే ఇచ్చారు. కానీ మీడియా దాన్ని పిటిషన్‌గా చూపిస్తూ నేను విచారణకు నిరాకరించానని నిరాధార వార్తలు ప్రసారం చేసింది. రిజిస్ట్రీ దగ్గర పరిశీలించగా ఆ విషయంపై ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదు.’’ అని సీజేఐ వివరణ ఇచ్చారు. అసలు పిటిషన్ దాఖలు కాకుండానే కేసు పెండింగ్‌లో ఉందని ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని విమర్శించారు. బాధ్యత లేకుండా మీడియా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు.
జూలై 20న ‘‘చలో సంసద్’’ పేరుతో సీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వేలాది మంది పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. నీట్ పరీక్షల్లో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ఉపయోగించి అతిగా బలప్రయోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు పోలీసులు మాత్రం నిరసనకారులే హింసకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో అనంతరం ఢిల్లీ హైకోర్టు ఈ ఘటనపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించింది. నిరసనల సమయంలో పోలీసులు అతిగా బలప్రయోగం చేశారనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. అయితే తనపై అసత్య ప్రచారం జరుగుతోందని సీజేఐ సూర్యకాంత్ వాపోయారు.
తాజావార్తలు
-
CJI Surya kant: సీజేపీ నిరసనల పిటిషన్‌పై సూర్యకాంత్ కీలక ప్రకటన
-
Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..
-
Lothukunta Land Case: లోతుకుంట భూముల కేసులో హైడ్రాకు హైకోర్టు షాక్..
-
Toxic: ‘టాక్సిక్’కి సెన్సార్ కష్టమేనా?
-
Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!