India China: భారత్‌ని చుట్టుముట్టేలా చైనా ప్లాన్.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో త్రైపాక్షిక సమావేశం..
- చైనా-పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య త్రైపాక్షిక సమావేశం..
- ఏ దేశానికి వ్యతిరేకంగా కాదని చైనా ప్రకటన..
- దుష్ట పన్నాగంపై భారత్ ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India China: చైనా-పాకిస్తాన్-బంగ్లాదేశ్ కలిసి దుష్ట పన్నాగాన్ని పన్నుతున్నాయి. భారత్‌ని చుట్టుముట్టేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇటీవల ఈ మూడు దేశాలు కలిసి త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. చైనా చరిత్రలో తొలిసారిగా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించడం భారత్‌కి ఆందోళన కలిగించే విషయం. గతంలో, షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత అనుకూల వైఖరిని అవలంభించేంది. ఎప్పుడైతే మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు పాకిస్తాన్, చైనాలు భారత్‌కి ఎప్పటి నుంచో శత్రు దేశాలుగా ఉన్నాయి.
మీడియా నివేదికల ప్రకారం, ఈ సమావేశంలో చైనా ఉప విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్, బంగ్లాదేశ్ తాత్కాలిక విదేశాంగ కార్యదర్శి రుహుల్ ఆలం సిద్ధిఖీ, పాకిస్తాన్ అదనపు విదేశాంగ కార్యదర్శి ఇమ్రాన్ అహ్మద్ సిద్ధిఖీ పాల్గొన్నారు, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ కూడా వీడియో లింక్ ద్వారా చైనాలోని కున్మింగ్ నగరంలో జరిగిన చర్చలలో పాల్గొన్నారు. ఈ త్రైపాక్షిక సమావేశంపై బలోచ్ చైనాను ప్రశంసించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పింది. చైనా, దక్షిణాసియా దేశాలతో పాకిస్తాన్ లోతైన సంబంధాలను కోరుకుంటోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది.
Also Read
- Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
- IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
Read Also: Kolkata Gang Rape: కోల్‌కతా లా కాలేజీ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం..
ఈ అధికార ప్రకటనలో ఈ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని చెప్పింది. అయినప్పటికీ, ఈ మూడు దేశాలను ఇప్పుడు భారత్ నమ్మే పరిస్థితి లేదు. వాణిజ్యం, పెట్టుబడి, ఆరోగ్యం, విద్య, సముద్ర వ్యవహారాలు, వివిధ రంగాల్లో త్రైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని చైనా, పాక్, బంగ్లా విదేశాంగ కార్యదర్శులు అంగీకరించారు. త్వరలో ఈ మూడు దేశాలు ఒక వర్కింగ్ గ్రూప్‌ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం, భారత్‌కి మూడు వైపులు ఉన్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు భారత వ్యతిరేకతకు మారుపేరుగా ఉన్నాయి. చైనా-పాకిస్తాన్ మధ్య ఎప్పటి నుంచో చిక్కటి స్నేహం ఉంది. గతంలో భారత్ వైపు బంగ్లాదేశ్ ఉన్నప్పటికీ, షేక్ హసీనా తర్వాత పరిణామాలు మారాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత పెరిగింది. పాకిస్తాన్ చేసిన అరాచకాలను మరిచిన బంగ్లాదేశ్ ఆ దేశంలో సన్నిహితంగా మెలుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు దేశాల పట్ల భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Cocktail 2 OTT Release: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్, షాహిద్ ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ చూడవచ్చు
-
Honor Play 11 Pro: హానర్ ప్లే 11 ప్రో రిలీజ్.. 50MP కెమెరా, 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!