Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News China Wont Attend G20 Meet In Disputed Jk Indias Firm Powerful Response

G20 Meeting: కాశ్మీర్‌లో జీ20 సమావేశానికి హాజరుకామన్న చైనా.. భారత్ స్ట్రాంగ్ రిఫ్లై

Published Date :May 20, 2023 , 3:17 pm
By Venu Goapl Reddy
G20 Meeting: కాశ్మీర్‌లో జీ20 సమావేశానికి హాజరుకామన్న చైనా.. భారత్ స్ట్రాంగ్ రిఫ్లై
  • Follow Us :
  • google news
  • dailyhunt

G20 Meeting: జమ్మూ కాశ్మీర్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ కు వంత పాడుతోంది చైనా. మరోసారి భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. పర్యాటక రంగంపై జీ 20 వర్కింగ్ గ్రూప్ మూడో సదస్సు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిర్వహించాడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. శ్రీనగర్ లో ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజలు పాటు సభ్యదేశాలతో సమావేశం జరుగనుంది. దీనికి ఇప్పటికే భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అంతర్జాతీయ సమావేశం కావడంతో జమ్మూ కాశ్మీర అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది భారత్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్ఎస్‌జీ, సీఆర్పీఎప్, మెరైన్ కమాండోలు, సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శ్రీనగర్ దాల్ సరస్సులో మెరైన్ కమాండోలు గస్తీ కాస్తున్నారు.

ఇదిలటా ఉంటే శ్రీనగర్ లోని ‘‘షేర్ ఏ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’’లో జరగబోతోంది. దీనిపై డ్రాగన్ కంట్రీ చైనా అభ్యంతరం తెలిపింది. వివాదాస్పద భూభాగంలో ఇటువంటి భేటీలు జరపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ బెన్ బిన్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు భారత్ ఘాటుగానే స్పందించింది. భారత్ తన సొంత భూభాగంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహిస్తుందని, చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి సరిహద్దు వెంబడి శాంతి, సుస్థిరత అవసరం అని మన దేశం స్పష్టం చేసింది.

Read Also: Minister KTR: వాషింగ్టన్ డీసీలో WTITC స్కై సోర‌ర్ లాంచ్ చేసిన మంత్రి కేటీఆర్‌

ఇదిలా ఉంటే ఈ సమావేశానికి తన మిత్రదేశాలు రాకుండా, సమావేశం భగ్నం అయ్యేందుకు పాకిస్తాన్ అన్ని మార్గాలు వెతుకుతోంది. మిత్ర దేశాలు ఈ సమావేశానికి వెళ్లకుండా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేపడుతోంది. ఇప్పటికే పాక్ అత్యంత మిత్రదేశాలు అయిన టర్కీ, సౌదీ అరేబియా, చైనాలపై ఒత్తిడి తీసుకువస్తోంది. చైనా ఈ సమావేశానికి హాజరుకాబోమని చెబుతున్న నేపథ్యంలో సౌదీ, టర్కీ ఈ సమావేశాని హాజరుకావడం సందేహంగా మారింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ఇదే. జీ 20 సమావేశం కోసం 60 మందికి పైగా విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. విదేశీ ప్రముఖులు కాశ్మీర్ అందాలను తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. విస్తృతంగా భద్రతా ఏర్పాట్లను చేశారు. శ్రీనగర్ మొత్తాన్ని ‘నో డ్రోన్’జోన్ గా అధికారులు ప్రకటించారు. అనుమానాస్పద అంతర్జాతీయ కాల్స్, వదంతుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • G20
  • G20 MEETING
  • jammu kashmir
  • Pakistan

తాజావార్తలు

  • Ramayana: రామాయణ గ్రాఫిక్స్ పై ఆడియన్స్ సీరియస్!

  • Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..

  • Guavas Theft: అమానుషం.. జామకాయలు దొంగిలించిందని చిన్నారిని కొట్టి గొలుసులతో బంధించిన రిటైర్డ్ ఆర్మీ

  • Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..

  • LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions