China renames 11 places in Arunachal Pradesh: జిత్తులమారి చైనా భారత్ తో స్నేహం అంటూనే తాను చేయాల్సిన పనులు చేస్తోంది. ఓ వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సృష్టిస్తూ భారత్ ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. భారత భూభాగం అయిన అరుణాచల్ ప్రదేశ్ తమదిగా చెప్పుకుంటోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు చైనా కొత్త పేర్లను పెట్టింది. 11 ప్రాంతాలకు మూడో విడతగా చైనా పెట్టింది. చైనా, టిబెటన్, పిన్ యిన్ భాషల్లో పేర్లను విడుదల చేసింది. చైనా పౌర వ్యవహారాల శాఖ మంత్రి ఆదివారం ఈ పేర్లను విడుదల చేశారు. చైనా కేబినెట్ నిర్ణయం మేరకు ‘జాన్ నన్’ పేరుతో ఈ జాబితాను చైనా విడుదల చేసింది.
Read Also: Mughals Out Of Syllabus: సీబీఎస్ సిలబస్ నుంచి మొఘలుల చరిత్ర తొలగింపు..
కొత్తగా పేర్లు విడుదల చేసిన వాటిలో 2 భూభాగాలు, 5 పర్వతాలు, 2 నివాస ప్రాంతాలు, 2 నదులు ఉన్నట్లు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ పై తమకు హక్కు ఉందని చెపుకోవడానికి చైనా ఇలా చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా ‘దక్షిణ టిబెట్’గా పేర్కొంటోంది. గతంలో ఇలాగే రెండు సార్లు అరుణాల్ భూభాగాలకు పేర్లు పెట్టింది చైనా. 2017లో తొలిసారిగా 6 ప్రాంతాలకు, 2021లో రెండోసారి 15 ప్రాంతాలకు ఇలా పేర్లను విడుదల చేసింది. చైనా చర్య పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అరుణాచల్ ఎల్లప్పుడు భారత భూభాగమే అని, భారత్ లో అంతర్భాగంగా ఉంటుందని, పేర్లను పెట్టడం ద్వారా వాస్తవాన్ని మార్చలేని భారత్ పేర్కొంది.