China: తీరు మార్చుకోని చైనా.. అరుణాచల్, అక్సాయ్‌చిన్‌లతో మ్యాప్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: డ్రాగన్ కంట్రీ చైనా తన తీరుమార్చుకోవడం లేదు. భారత్‌పై నిత్యం అక్కసు వ్యక్తం చేస్తూ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇప్పటికే గాల్వాన్ లోయ సమీపంలోని పాంగాంగ్‌త్సో సరిస్సు వద్ద గలాటా సృష్టిస్తున్న చైనా ఇప్పుడు మరో కొత్త పన్నాగానికి తెర లేపింది.
ఇదిలా ఉంటే చైనా మరోసారి భారత భూభాగాలను తనవిగా చూపిస్తూ కొత్త మ్యాపులను విడుదల చేసింది. భారత భూభాగాలైన అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలను తన భూభాగాలుగా చూపుతోంది. చైనా ఇటీవల తన దేశపు ప్రామాణిక మ్యాపులను రిలీజ్ చేసింది. ఆగస్ట్ 28న విడుదల చేసిన ఈ మ్యాపు దౌత్యపరమైన ఆందోళనలకు కారణం అవుతోంది. చైనా అధికార మ్యాప్, 2023 ఎడిషన్ గా కొత్త మ్యాపులను రిలీజ్ చేసింది. చైనా సహజ వనరుల మంత్రిత్వి శాఖ స్టాండర్డ్ మ్యాప్ సర్వీస్ వైబ్‌సైట్ ద్వారా వీటిని ప్రచురించింది.
Also Read
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
Read Also: West Bengal: చివరి కోరికగా రసగుల్లాలు ఇచ్చి మరీ స్నేహితుడిని చంపిన 8వ తరగతి విద్యార్థులు
కొత్తగా విడుదల చేసిన మ్యాపులను చైనా గ్లోబల్ టైమ్స్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అరుణాచల్‌లోని 11 ప్రాంతాలు తమ భూభాగమే అంటూ ఎడిషన్ ఆఫ్ ది స్టాండర్డ్ మ్యాప్ ఆఫ్ చైనా-2023 పేరుతో మ్యాప్ తయారీ చేసింది. డిజిటల్, నేవిగేషన్ మ్యాప్ విడుదల చేస్తామని ప్రకటించింది డ్రాగన్ కంట్రీ.
చైనా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా పేర్కొంటోంది. 1962 యుద్దంలో జమ్మూా కాశ్మీర్ ప్రాంతంలోని అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. ఈ భూభాగం కూడా తమదే అని మ్యాపుల్లో చూపిస్తోంది. ఇదిలా ఉంటే భారతదేశం పలు సందర్భాల్లో అరుణాచల్ భారత్ లో భూభాగమే అని ఇది మారదని చెబుతోంది.
ఇక డ్రాగన్ కంట్రీ తైవాన్ భూభాగాన్ని కూడా తమదే అని చూపిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చాలా భూభాగాన్ని తమదే అని చెబుతోంది. ఇటు భారత్ తో పాటు అటు తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై దేశాలతో సరిహద్దు తగాదాలను పెట్టుకుంది.
The 2023 edition of China's standard map was officially released on Monday and launched on the website of the standard map service hosted by the Ministry of Natural Resources. This map is compiled based on the drawing method of national boundaries of China and various countries… pic.twitter.com/bmtriz2Yqe
— Global Times (@globaltimesnews) August 28, 2023
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..