India-Pakistan Border: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో కాశ్మీర్ వెంబడి నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్‌కి చైనా సైనిక మద్దతు అందిస్తోంది. గత కొంత కాలంగా సరిహద్దు వెంబడి అత్యాధునిక సౌకర్యాలను పాకిస్తాన్ పెంపొందించుకుంటోంది. అయితే, చైనాతో ఉద్రిక్తతల కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉందని, సరిహద్దు వెంబడి ఎలాంటి బెదిరింపులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని అధికారులు చెప్పారు.
పాకిస్తాన్ కీలక మిత్రదేశమైన చైనా గత మూడు సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్‌లోని ఎల్ఓసీ వెంబడి ఉక్కు బంకర్ల నిర్మాణంతో పాటు మానవరహిత వైమానికి, యుద్ధ విమానాల ఏర్పాటుతో సహా పాకిస్తాన్ సైన్యం రక్షణ సామర్థ్యాలను చురుకుగా పెంచుతోందని బుధవారం అధికారులు తెలిపారు. చైనా సహాయంతో హైలీ ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ టవర్స్‌ని ఇన్‌స్టాల్ కోసం ఎల్ఓసీ వెంబడి భూగర్భ ఫైబర్ కేబుల్స్ ఏర్పాటును కూడా విస్తరించింది. ఇదే కాకుండా చైనీస్ మూలాలకు చెందిన అధునాతన రాడార్ సిస్టమ్స్ ‘JY’ మరియు ‘HGR’ సిరీస్‌లు, మీడియం అండ్ లో అల్టిట్యూడ్ టార్గెట్ డిటెక్షన్ సామర్థ్యాలు మెరుగయ్యాయని తెలుస్తోంది.
Read Also: Sithara Ent: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలోనూ అదే ఫాలో అవుతున్న నాగవంశీ!
వీటిలో పాటు చైనీస్ సంస్థ తయారు చేసి 155 mm ట్రక్కు-మౌంటెడ్ హోవిట్జర్ గన్, SH-15 ఉనికిని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రదేశాల్లో గుర్తించబడింది. ఈ చర్య వల్ల పాకిస్తాన్-చైనా సంబంధాలు బలోపేతం కావడంతో పాటు, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) వెంబడి నిర్మిస్తున్న చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(CPEC)కి సంబంధించిన చైనా పెట్టుబడులను కాపాడే ప్రయత్నాలలో భాగంగా పరిగణించబడుతుంది. 2014లో గుర్తించినట్లు, ఫార్వర్డ్ పోస్టుల వద్ద సీనియర్ చైనా అధికారుల ఉనికి కనిపించనప్పటికీ, చైనా దళాలు మరియు ఇంజనీర్లు నియంత్రణ రేఖ వెంబడి భూగర్భ బంకర్‌లను నిర్మించడంతో సహా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారని అధికారులు తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని లీపా వ్యాలీలో చైనా నిపుణులు సొరంగం నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారని, కారకోరం హైవేతో అనుసంధానించడానికి ఆల్-వెదర్ రహదారికి సన్నాహాలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
చైనా వ్యూహాత్మక చర్యలో భాగంగా 46 బిలియన్ డాలర్లతో సీపెక్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టుని, చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సు మధ్య హైవే ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో గిల్గిట్ మరియు బాల్టిస్తాన్ ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ ప్రాంతంలో చైనా సైనిక సిబ్బంది కొనసాగడం ఆందోళనకు దారితీసింది.