DGCA: విమానాల్లో ప్రయాణించే పిల్లల కోసం ఏమియేషన్ బాడీ, డైరెక్టర్ జరరల్ ఆఫ్ సివిల్ ఏమియేషన్(DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్ల లోపు పిల్లలు విమానాల్లో ప్రయాణించేటప్పుడు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులలో ఒకరితో సీట్లు కేటాయించాలని అన్ని విమానయాన సంస్థలను కోరింది. 12 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రులతో కసి కూర్చోని సందర్భాల్లో ఈ ఆదేశాలు వచ్చాయి.
Read Also: Delhi: బుల్లెట్ ట్రైన్‌పై రైల్వే మంత్రి కొత్త కబురు
‘‘12 ఏళ్ల వరకు పిల్లలకు ఒకే PNRలో ప్రయాణిస్తున్న వారి తల్లిదండ్రులు/సంరక్షకుల్లో కనీసం ఒకరితో సీట్లు కేటాయించబడతాయని ఎయిర్‌లైన్స్ నిర్ధారిస్తుంది మరియు అదే విధంగా రికార్డు నిర్వహించబడుతుంది’’ అని డీజీసీఏ ప్రెస్ నోట్ పేర్కొంది. షెడ్యూల్ చేసిన బయలుదేరే ముందు వెబ్ చెక్-ఇన్ కోసం ఏ సీటును కూడా సెలెక్ట్ ఎంచుకోని ప్రయాణీకులకు ఆటో సీటు కేటాయించే నిబంధనలకు కూడా ఇది వర్తిస్తుందని డీజీసీఏ తెలిపింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సివిల్ ఏవియేషన్ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉంది. దేశీయంగా విమాన ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు కీలక నియమాలను డీజీసీఏ ఎయిర్ లైన్స్ సంస్థలకు సూచిస్తోంది.