Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన లొంగిపోయిన మావోలు
- వైరల్ వీడియోతో సినిమా అవకాశం
- త్వరలో ఓ హిందీ చిత్రంలో మెరవబోతున్న మావోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 9 మంది మహిళా మావోయిస్టులు బాలీవుడ్ సినిమా ఆఫర్ కొట్టేశారు. ఓ వైరల్ వీడియో వారికి సినిమా అవకాశం తెప్పించింది. త్వరలోనే స్క్రీన్‌పై మెరవబోతున్నారు. మావోయిస్టుల హింసాకాండపై ఓ హిందీ చిత్రం రాబోతుంది. అయితే ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మహిళా మావోయిస్టులు ర్యాంప్‌పై నడిచి జాతీయ వార్తల్లోకి ఎక్కారు. దీంతో వారంతా ప్రాచుర్యం పొందారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. దీంతో వారంతా చిత్ర నిర్మాతల కంట్లో పడ్డారు. దీంతో రియల్ మావోయిస్టులతోనే సినిమా చేయాలని భావించారు. అందులో భాగంగానే మహిళా మావోయిస్టులకు అవకాశం లభించింది.
నివేదికల ప్రకారం.. హిందీ చిత్రం 1994లో అవిభక్త మధ్యప్రదేశ్‌లోని బస్తర్‌లో జరిగిన ఒక వాస్తవమైన, సున్నితమైన సంఘటన ఆధారంగా సినిమా రాబోతుంది. చిత్రనిర్మాతలు ఈ కథను పూర్తిగా వాస్తవికంగా, సజీవంగా ఉంచాలని కోరుకుంటున్నారు. అందుకే నిజ జీవితంలో నక్సలిజం వల్ల తీవ్ర ఇబ్బందులు పడి, ఇప్పుడు తిరిగి ప్రధాన స్రవంతిలోకి వచ్చిన తొమ్మిది మంది మహిళలను ఈ చిత్రంలో చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ సినిమా షూటింగ్లో ఎక్కువ భాగం బస్తర్‌లోని దట్టమైన అడవుల్లో, దక్షిణ బస్తర్ ప్రాంతాల్లో జరగనుంది.
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
వైరల్ వీడియోతో..
నిజానికి సుక్మా జిల్లా పునరావాస కేంద్రంలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న సుశీల, ఆండే భీమే, కుంజం హిద్మే, మైకం మహిమ, నందిని, దోడి రామే, జోగి వెట్టి, పోడియం రాజేలు రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ వేదికపై ఆత్మవిశ్వాసంతో ర్యాంప్‌పై నడిచినప్పుడు, వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన తర్వాతే చిత్రనిర్మాతలు ఈ మహిళలను గమనించారు. అలాగున వారికి అవకాశం ఇచ్చారు. ఇక సినిమాలోకి తీసుకునే ముందు వారికి నటనపై అవగాహన కల్పించనున్నారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి కూడా ఈ మార్పు పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. బస్తర్ ప్రాంత ప్రజలలో ప్రతిభకు కొరత లేదని, వారికి కేవలం ఒక వేదిక, సరైన అవకాశాలు మాత్రమే అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రయత్నాల వల్ల బస్తర్‌లో నక్సలిజం నిర్మూలించబడుతోందని, శాంతి పునరుద్ధరించబడటంతో, బస్తర్ ప్రతిభావంతులు ఇప్పుడు దేశం, ప్రపంచం ముందు తమను తాము నిరూపించుకోవడానికి పుష్కలమైన అవకాశాలు పొందుతున్నారని అన్నారు.
#WATCH | Raipur, Chhattisgarh: Former women Naxals, who once carried weapons in the dense forests of Bastar, walked the ramp to huge applause at a National Handloom Day event in Raipur after joining the mainstream. (07.08) https://t.co/51mc8lEXWE
— ANI (@ANI) August 13, 2026
తాజావార్తలు
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!