Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు సంచలనంగా మారాయి. ఆధ్యాత్మకవేత్త ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడున్న రాకెట్ బయటపడింది. ఈ రాకెట్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం అధికారులను నివ్వెరపరుస్తోంది. ‘‘లవ్ జిహాద్’’ని ఆయుధంగా చేసుకుని పలువురు ముస్లిం యువకులు, హిందూ అమ్మాయిలను ప్రేమించి, పెళ్లి చేసుకుని, మతం మారుస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు లవ్ జిహాద్ కోసం ఛంగూర్ బాబా ముస్లిం యువకులకు లక్షల్లో డబ్బు ఇచ్చినట్లు విచారణలో తేలింది. మిడిల్ ఈస్ట్‌లోని అరబ్ దేశాల నుంచి వందల కోట్లలో డబ్బు రావడం చూస్తే, ఇది పెద్ద ఎత్తున దేశద్రోహ చర్యగా భావిస్తున్నారు. దీనిపై ఇప్పుడు9 యూపీ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఎన్ఐఏ,ఈడీలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి.
Read Also: WCL 2025: జులై 20న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా యువరాజ్ సింగ్!
ఏటీఎస్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఈడీ సంస్థలు ఇప్పుడు చంగూర్ బాబా ‘‘రెడ్ డైరీ’’పై దృష్టిసారించాయి. విదేశాల నుంచి రూ. 106 కోట్ల విదేశీ నిధులు కలిగి ఉన్నాయని తెలిసిన కొన్ని రోజుల తర్వాత ఈ రెడ్ బుక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్టీఎఫ్ దాడుల్లో ఛంగూర్ బాబా విలాసవంతమైన భవనంలో ఇది లభించింది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు రాజకీయ నేతలు ఛంగూర్ బాబా నుంచి ఆర్థిక సాయం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిలో రాజకీయ నేతల పేర్లతో పాటు అధికారుల పేర్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా డైరీలో, ఆరుగురు కీలక నేతలు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం పొందినట్లు తెలుస్తోంది. వీరితో పాటు పోలీస్ అధికారుల పేర్లు కూడా ఈ బుక్‌లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సైకిల్‌పై ఉంగరాళ్లు, రంగురాళ్లు అమ్ముకునే స్థాయి నుంచి ఏకంగా వందల కోట్ల నిధులు సేకరించే స్థాయికి చేరాడు ఛంగూర్ బాబా. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉన్న బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్‌ని కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా హిందూ మహిళల్ని మతం మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులకు నిధులు సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే జూలై 5న ఛంగూర్ బాబా, అతడి సన్నిహితురాలు నీతు అలియాస్ నస్రీన్‌లను లక్నోలో అరెస్ట్ చేశారు.