దేశంలో ఈ మధ్య ప్రేమోన్మాదులు ఎక్కువ అవుతున్నారు.. ప్రేమను కాదాన్నారనో.. లేదా అనుమానం తోనే విచక్షణా రహితంగా అమ్మాయిలను చంపుతున్న ఘటనలు జరుగుతున్నాయి.. నిన్న ఢిల్లీలో మైనర్ బాలికను కత్తితో పొడిచి చంపేసిన ఘటన మరువక ముందే ఛత్తీస్‌గడ్‌లో మరో దర్ఘటన జరిగింది. ఓ యువతిని ఆయన బాయ్‌ఫ్రెండ్ స్క్రూ డ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపేశాడు.. ఆ యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉందని అనుమానంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని కోర్బా జిల్లాలో వెలుగు చూసింది..
కోర్బా జిల్లా సీఎస్ఈబీ పోలీసు స్టేషన్ సమీపంలోని పంప్ కాలనీకి చెందిన నీలం కుసుం పన్నా.. బస్ కండక్టర్ షాబాజ్‌కు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది… అయితే మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు.. ఇక అతడికి వేరే జాబ్ రావడంతో వేరే ప్రాంతానికి వెళ్ళాడు..కోర్బా జిల్లా సీఎస్ఈబీ పోలీసు స్టేషన్ సమీపంలోని పంప్ కాలనీకి చెందిన నీలం కుసుం పన్నా.. బస్ కండక్టర్ షాబాజ్‌కు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది…
గతేడాది షాబాజ్ గుజరాత్ నుంచి కోర్బాకు క్రిస్మస్ పండుగకు ఒక రోజు ముందే చేరుకున్నాడు. అతను నేరుగా కుసుం ఇంటికి వెళ్లాడు. ఆమె పండుగ కోసం రెడీ అవుతున్నది..అప్పుడే ఓ స్క్రూ డ్రైవర్‌తో కుసుంపై షాబాజ్ దాడి చేశాడు. చాతిలో 34 సార్లు, వెనుక వైపున 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు.. ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయాడు.. పోలీసులు ఇన్ని నెలలు శ్రమించి కేసును చేధించారు.. నిండుతుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..