Chandigarh Airport To Be Named After Shaheed Bhagat Singh: పంజాబ్, హర్యానా ప్రభత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మార్చారు. ఈ మేరకు రెండు ప్రభత్వాలు అంగీకరించాయని.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ శనివారం తెలిపారు. చండీగఢ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు షమీద్ భగత్ సింగ్ పేరును పెట్టనున్నారు.
ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హాజరు కాగా.. హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలా పాల్గొన్నారు. షహీద్ భగత్ సింగ్ జీ పేరు మీద చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును హర్యానా, పంజాబ్ ప్రభత్వాలు అంగీకరించాయని.. ఈ అంశంపై హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలాతో సమావేశం అయ్యామని.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్వీట్ చేశారు.
Read Also: Shruti Haasan: పారితోషికం అమాంతం పెంచేసింది.. ఎన్ని కోట్లో తెలుసా?
స్వాతంత్య్ర సమరయోధుడి పేరు మార్చడం ఇది తొలిసారి కాదు. గతంలో 2016లో చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టాలని హర్యానా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మాణం చేశాయి. భగత్ సింగ్ అమరుడైన మార్చి 23ను పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర సెలవుదినంగా ప్రకటించింది. ఇప్పటికే ఆప్ ప్రభుత్వం ప్రభుత్వ అన్ని కార్యాలయాల్లో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటోతో పాటు స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ ఫోటోలను తప్పని సరిగా పెట్టాలని ఆదేశించింది. ఇటు ఢిల్లీలో, అటు పంజాబ్ లో అన్ని కార్యాలయాల్లో వీరిద్దరి ఫోటోలను పెట్టారు.