ఒమిక్రాన్ పై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం తగదని ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. పోలియోకి వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చిందని, కరోనాకు వేగంగా వ్యాక్సిన్ తీసుకొచ్చిన ఘనత మనదేన్నారు. ఇప్పటికే దేశంలో హర్‌ఘర్ దస్తక్ కార్యక్రమం ద్వారా దేశంలో ప్రతి పౌరునికి ఉచిత టీకాను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. రెండో డోసు తీసుకోని వారు ఇప్పటికైనా రెండో డోసు తీసుకోవాలని సూచించారు.
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి బూస్టర్ డోస్ అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తుందని ఆయన లోక్‌సభలో పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రెస్ చేశామని, వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను కూడా ట్రెస్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. ఎవ్వరూ భయపడొద్దని అప్రమత్తంగా ఉండాల్సిన అసరం ఉందన్నారు. అయితే మంత్రి సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి బీజేపీ అబద్ధాలు చెబుతుందని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. కోవిడ్ నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు.