Kolkata doctor case: డాక్టర్ హత్యాచార ఘటనలో కీలక మలుపు.. ‘‘పాలిగ్రాఫ్ టెస్ట్’’కి హైకోర్టు అనుమతి..
- కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనలో కీలక మలుపు..
- నిందితుడి పాలిగ్రాఫ్ టెస్టుకి హైకోర్టు అనుమతి..
- సీబీఐ పిటిషన్‌ని అనుమతించిన హైకోర్టు..
- ఇప్పటికే నిందితుడికి ‘‘సైకలాజికల్ టెస్టులు’’ పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata doctor case: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్ ‘‘పాలిగ్రాఫ్ టెస్ట్’’ నిర్వహించాలనే సీబీఐ పిటిషన్‌కి కలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుడు సంజయ్‌రాయ్‌కి రేపు సీబీఐ లై డిటెక్టర్ టెస్టును నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో గత శుక్రవారం 31 ఏళ్ల వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమె, రెస్ట్ తీసుకునేందుకు సెమినార్ హాలులో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, మహిళలు, సాధారణ ప్రజలు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Read Also: Health: విటమిన్ ‘సి’ ఎక్కువగా తీసుకుంటున్నారా..? జరిగే అనర్థాలు ఇవే..!
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ఈ కేసులో ప్రభుత్వం, కోల్‌కతా పోలీసుల నిర్లక్ష్యంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు సీబీఐకి అప్పగించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌కి ‘‘సైకలాజికల్ టెస్టు’’ని సీబీఐ నిర్వహించింది. నిందితుడి మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ టెస్టుని నిర్వహించారు. నిన్న ఐదుగురు సీబీఐ వైద్యుల బృందం కోల్‌కతా చేరుకుని ఈ టెస్టుని నిర్వహించినట్లు తెలుస్తోంది. సైకలాజికల్ టెస్టులో నిందితుడి మానసిక విశ్లేషణ చేసి అంచనా వేయనున్నారు. ఇది అండర్ ట్రయల్స్‌లో వారి అలవాట్లు, దినచర్య, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి చేస్తారు. ఈ పరీక్షలో, దర్యాప్తు సంస్థ సంజయ్ రాయ్ వాయిస్‌ని లేయర్డ్ వాయిస్ విశ్లేషణలో ఉంచవచ్చు, అంటే లై-డిటెక్టర్ పరికరం, దాని ద్వారా అతను నిజమే చెబుతున్నాడో లేదో నిర్ధారించుకోవచ్చు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!