Khalistani terrorist: కెనడాలో ఉంటూ, ఖలిస్తాన్ అంటూ గొడవ చేసే ఉగ్రవాదులు భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌కు ఖలిస్తానీ ఉగ్రవాది ఇందర్ జీత్ గోసల్ బెదిరింపులు జారీ చేశారు. అరెస్ట్ అయిన కొద్ది రోజులకే కెనడాలో బెయిల్ పొందిన ఇందర్ జీత్ ‘‘ దోవల్, నేను మీ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని వార్నింగ్ ఇచ్చాడు.
Khalistan Referendum: ‘ఖలిస్తాన్’ పేరుతో భారత్ పై ఖలిస్తానీవాదులు విషం చిమ్ముతున్నారు. ముఖ్యంగా కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని కొంతమంది ఖలిస్తానీ వేర్పాటువాదులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
India Seeks Action On Khalistan Referendum: కెనడాలో రాడికల్ వ్యక్తులు కొంతమంది చేపడుతున్న ‘‘ ఖలిస్తాన్ రెఫరెండం’’పై భారత్ సీరియస్ అయింది. గురువారం నాడు ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కెనడాను కోరింది. స్నేహపూర్వక దేశమైన కెనడాలో ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాలను అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. దౌత్యమార్గాల్లో కెనడా అధికారులకు ఈ విషయాన్ని భారత్ తెలిపిందని.. ఈ విషయంలో కెనడాపై ఒత్తడి తెస్తూనే ఉంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్…