ఈ మధ్య సమాజంలోకి పాడు సంస్కృతి ప్రవేశించింది. ఉల్లాసమైనా, ఆనందమైనా పరిధిలో ఉండాలి. అది శృతిమించితే దు:ఖమే మిగులుతుంది. ఇప్పుడు ఏ శుభకార్యం జరిగినా.. ఏ పండుగ వచ్చినా మొట్టమొదటిగా గుర్తొచ్చేది డీజే సౌండే. ఏ చిన్న కార్యక్రమం జరిగినా నిర్వాహకులు డీజే సౌండ్‌నే బుక్ చేస్తున్నారు.
ఇప్పుడు హెడ్‌ఫోన్స్ ఓ ట్రెండ్‌గా మారిపోయింది.. హెడ్‌ఫోన్స్, ఇయర్‌బర్డ్స్ ఇలా రకరకాల పరికరాలను చెవుల్లో పెట్టుకుని భారీ శబ్దాలతో సినిమాలు చూస్తున్నారు, మ్యూజిక్ ఆశ్వాదిస్తున్నారు.. పక్కనవారు ఏమైనా మాట్లాడినా? ఏదైనా చెప్పినా కూడా వినిపించకపోవడంతో.. పట్టించుకోవడం లేదు.. అలా మారిపోయింది పరిస్థితి.. అయితే, హెడ్‌ఫోన్స్, ఇయర్‌బర్డ్స్ వంటివి వాడడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి వినికిడి ముప్పు పొంచిఉన్నట్టు ఓ అధ్యయనం తేల్చింది.. ప్రపంచ వ్యాప్తంగా కొన్నేళ్లుగా హెడ్‌ఫోన్లు, ఇయర్ బర్డ్స్ లాంటివి వాడుతూ.. పెద్ద శబ్దాలతో…