Lenin OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న100 కోట్ల బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘లెనిన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenin OTT: వరుస పరాజయాల తరువాత ఒక్క హిట్ అందుకోవాలని ఎదురుచూసిన అక్కినేని అఖిల్‌కు ఎట్టకేలకు ‘లెనిన్’ రూపంలో బ్లాక్‌బస్టర్ దక్కింది. రిలీజ్ ముందే మంచి అంచనాలు సొంతం చేసుకున్న ఈ గ్రామీణ యాక్షన్ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసి, అఖిల్ కెరీర్లో తొలి రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ విజయవంతమైన సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’లో అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అఖిల్ నటన, మాస్ ప్రెజెన్స్‌కు మంచి ప్రశంసలు లభించాయి. ‘ఏజెంట్’ పరాజయం తర్వాత అఖిల్‌కు ఈ సినిమా కీలక మలుపుగా నిలిచింది.
థియేటర్లలో హిట్ టాక్ తో నడిచిన ‘లెనిన్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ZEE5 సొంతం చేసుకుంది. ఈ రోజు స్ట్రీమింగ్ డేట్ ను ఆఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసింది. ఈ మూవీ ఆగస్టు 7 నుంచి డిజిటల్ గా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంటి నుంచే ఈ సినిమాను చూసే అవకాశం పొందనున్నారు. ఈ మూవీలో అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే నటించగా శివాజీ, ప్రమోద్ పంజు, ఈశ్వరీ రావు, సునీల్, రాంకీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ‘లెనిన్’ ను సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్లపై నాగ వంశీ, నాగార్జున నిర్మించారు. సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి స్పందన లభించింది.
Also Read
- Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
- Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
2026 జూలై 10న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై వంద కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీ ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణతో వెళ్ళేలానే కనబడుతోంది. ఎందుకంటే అక్కినేని అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను డిజిటల్ వేదికపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 7 నుంచి ZEE5లో మరోసారి ‘లెనిన్’ సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!