కన్నడ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. కాంగ్రెస్-జేడిఎస్ పార్టీలు కలిసి గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంవత్సరం తిరగక ముందే ఆ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేసీ సీనియర్ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా రెండేళ్లు పరిపాలన సాగించారు. వయసు రిత్యా ఆయన పదవి నుంచి తప్పుకొవడంతో బొమ్మైని ముఖ్యమంత్రి పదవి లభించింది. పాత మంత్రి వర్గాన్ని కొనసాగించకుండా తనదైన ముద్ర వేసుకోవడానికి మంత్రి వర్గాన్ని ముఖ్యమంత్రి బొమ్మై ప్రక్షాళన చేశారు. 18 మందికి అవకాశం కల్పించారు. అయితే, ఇప్పుడు మంత్రి వర్గంలో అసంతృప్తి మొదలైంది. కోరుకున్న మంత్రి పదవులు రాలేదని పలువురు మంత్రులు అసంతృప్తితో ఉన్నారు.
Read: ‘జీ లే జరా’… ఆలియా, కత్రీనా, ప్రియాంక…
తనకు కోరుకున్న పదవిని ఇవ్వలేదని, బీజేపీ తన స్థాయిని తగ్గించే విధంగా ప్రవర్తిస్తోందని ఎంటీబీ నాగరాజ్ పేర్కొన్నారు. కోరుకున్న పదవి లభించకపోవడంతో పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి కొన్ని రోజులు కూడా కాకముందే మంత్రివర్గంలో అసంతృప్తి మొదలవడంతో బసవరాజు బొమ్మై సర్కార్ అయోమయంలో పడిపోయింది. అసంతృప్తులను బుజ్జగించినా వినకపోవడంతో ఈ పదవుల సమస్యను అధిష్టానం ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రెడీ అవుతున్నారు. మరి అసంతృప్తులు కోరుకున్న పదవులను ఇచ్చేందుకు అధిష్టానం ఒప్పుకుంటుందా? వారిని బుజ్జగించి అసమ్మతికి చెక్ పెడతారా… చూడాలి.