దేశంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా వరుసబెట్టి వీఐపీలందరూ కరోనా బారిన పడుతున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బీహార్ సీఎంవో వెల్లడించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ సీఎం నితీష్ పిలుపునిచ్చారని తెలిపింది. గతవారం నితీష్ కుమార్ నివాసంలో 11 మందికి కరోనా…
కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ అధిష్టానానికి తలనొప్పులు తప్పడం లేదు. అయితే గతంలో బీజేపీ అధిష్టానం ఆ రాష్ర్ట ప్రస్తుత సీఎంను తప్పిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ దీనిపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లడం లేదని ఆయన చెప్పారు. దావోస్‌లో జరగబోయే…
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని సదాశివ నగర్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అవమానించారనే ఆరోపణలతో సంఘ్ పరివార్ మూకలు రెచ్చిపోయారు. బెలగావిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు సంగూలి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బస్సులపైకి, కార్లపైకి రాళ్ళు విసిరుతూ భయాందోళనలు సృష్టించారు. కొన్ని ప్రాంతాల్లో బంద్ కూడా నిర్వహించారు. సంఘ్ పరివార్ మూకల అరాచకాలను నిరసిస్తూ మైసూరులో యువ జనతా…
కన్నడ సీని పరిశ్రమ మరోసారి విషాదంలో మునిగింది. ఈ మధ్య కాలంలో మరణించిన పునీత్ రాజ్‌కుమార్ మృతి నుంచి కన్నడ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాగా తాజాగా మరోనటుడు మరణించిన వార్తను కన్నడ సీని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ కన్నడ నటుడు శివరాం శనివారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 83 ఏళ్ల శివరాం మంగళవారం రాత్రి తన నివాసంలో పూజా కార్యక్రమాలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకులారు. శివరాంను కుటుంబ…
దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన మరణాంతరం ఆయనకు ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పునీత్ రాజ్ కుమార్ కు ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా తెలిపారు. అక్టోబర్ 29 న పునీత్ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతిని కన్నడిగులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికి పలువురు అభిమానులు ఆయన మృతిని తట్టుకోలేక ఆత్మహత్యలకు…
పెట్రోలు, డిజీల్‌పై కేంద్రం వరుసగా రూ.10, రూ.5 తగ్గించిన నేపథ్యంలో, కర్ణాటకప్రభుత్వం పెట్రోల్, డిజీల్‌పై సేల్స్ ట్యాక్స్ రేటును రూ.7 తగ్గిస్తూ, దీపావళి సందర్భంగా ప్రజలకు తీపి కబురు నందించింది. రాష్ట్రంలో డీజిల్ ధర రూ.104.50 నుంచి రూ.85.03కి తగ్గింది, రూ.19.47 తగ్గింపు’’ అని జీవో జారీ చేసింది. పెట్రోలు ధర రూ. 113.93 నుంచి రూ. 100.63కి తగ్గింది, రూ. 13.30 తగ్గింపు’’ అని ఆ జీవోలో కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల్లో…
కర్ణాటక రాష్ట్రం ఏర్పడి 65 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రం ఏర్పాటైన తరువాత సరిహద్దు వివాదాలు నెలకొన్నాయని, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని, సరిహద్దుల్లోని ప్రాంతాలకు పాత పేర్లు ఉండటం వలనే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని తెలిపారు. Read: ఆ కేసులో మాజీ మంత్రి అరెస్ట్… ఇప్పటికే హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని కల్యాణ…
కన్నడ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. కాంగ్రెస్-జేడిఎస్ పార్టీలు కలిసి గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంవత్సరం తిరగక ముందే ఆ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేసీ సీనియర్ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా రెండేళ్లు పరిపాలన సాగించారు. వయసు రిత్యా ఆయన పదవి నుంచి తప్పుకొవడంతో బొమ్మైని ముఖ్యమంత్రి పదవి లభించింది. పాత మంత్రి వర్గాన్ని కొనసాగించకుండా తనదైన ముద్ర వేసుకోవడానికి మంత్రి వర్గాన్ని ముఖ్యమంత్రి బొమ్మై ప్రక్షాళన చేశారు. 18…