BJP Manifesto: రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల.. అందరిలో ఆసక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Manifesto: లోక్‌సభ ఎన్నికల కోసం రేపు బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికతో పాటు ‘విక్షిత్ భారత్’ రోడ్‌మ్యాప్ ఎన్నికల ఎజెండాలో ప్రముఖంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం ఉంటుందని, దీనికి ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దుతో సహా పలు సైద్ధాంతిక వాగ్దానాలను నెరవేర్చిన బీజేపీ, తన తాజా మేనిఫెస్టోలో ఏ అంశాలను ప్రకటిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. యువత, మహిళలు, రైతులు, పేదలు అనేవి నాలుగు కులానే అని పలు సందర్భాల్లో ప్రస్తావించిన ప్రధాని మోడీ, ఈ మానిఫెస్టోలో వారి కోసం హమీలను ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది.
Read Also: Bournvita: బోర్న్‌విటాలో చక్కెర చేదును మిగిల్చిందా..? “హెల్త్ డ్రింక్” ట్యాగ్ ఎందుకు కోల్పోయింది..?
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ఇప్పటికే కాంగ్రెస్ న్యాయ్ సూత్రాల పేరుతో 25 హామీలను ప్రకటించింది. ఇందులో రైతులకు మద్దతు ధర, యువతకు ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలను ఇచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటుంటే, ఈసారి మోడీని ఎలాగైనా గద్దె దించుతామని ఇండియా కూటమి చెబుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!