Breaking News: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వేగంగా ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ తన తొలి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నేతలు లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు.
BJP Lok Sabha Candidates: గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం లోక్‌సభ అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చించింది. తొలి విడతలో 100 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు, త్వరలోనే జాబితా విడుదల చేస్తుందని తెలుస్తోంది. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలతో దక్షినాదిన తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ నివాసం నిన్న అమిత్ షా, జేపీ నడ్డా రాజ్‌నాథ్ సింగ్,…
Election 2024: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులపై చర్చ జరిగినట్లు సమాచారం.