BJP leader warning on Pathaan movie: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘పఠాన్’ వివాదాస్పదం అవుతోంది. సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ సాంగ్ మొదత్తం రచ్చకు కారణం అయింది. సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న దీపికా పదుకొణె ఈ పాటలో కాషాయం రంగులో ఉన్న బికినీ ధరించడం ప్రస్తుతం మొత్తం వివాదానికి కారణం అయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పాట ఉందని బీజేపీతో సహా పలు హిందూ గ్రూపులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక అంశాలు వెలుగులోకి
ఇప్పటికే ఈ సినిమాపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్ ఇచ్చారు. ఈ పాటలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకుంటే బ్యాన్ తప్పదని హెచ్చరించారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ లీడర్, ఎమ్మెల్యే రామ్ కదమ్ కూడా ఇదే విధంగా పఠాన్ సినిమాకు హెచ్చరిస్తూ ట్వీట్స్ చేశారు. హిందుత్వాన్ని అవమానపరిచేలా ఏదైనా సినిమా, సీరియల్ ఉంటే మహారాష్ట్రలో అనుమతించమని అన్నారు. మహారాష్ట్రలో హిందుత్వ ప్రభుత్వం ఉందని వెల్లడించారు. దీపికా పదుకొణె గతంలో జెఎన్‌యు విద్యార్థులకు సంఘీభావం ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘జెఎన్‌యు ధారి’ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ మండిపడ్దారు. హిందుత్వాన్ని అవమానించేలా ఏ సినిమా, సీరియల్ ఉన్నా.. మహారాష్ట్రలో అనుమతించం, జై శ్రీరాం అంటూ ట్వీట్ చేశారు రామ్ కదమ్.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో లవ్ జీహాద్ కోణాన్ని కూడా కొంత మంది చూస్తున్నారు. ‘బేషరం రంగ్’ పాటలో హిందూ నిటి కాషాయాన్ని ధరిస్తే, ముస్లిం నటుడు ఆకుపచ్చ డ్రెస్ వేసుకున్నాడని.. ఈ సినిమాను, మొత్తం బాలీవుడ్ ని బహిష్కరించాలంటూ హిందూ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్ ఇండోర్ లో షారుఖ్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పఠాన్ సినిమా వివాదం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.
#पठाण फिल्म को देश के कई #साधू #संत #महात्मा सहित social media पर भी कई #हिंदू संघटन तथा करोडो लोग इस फिल्म को कडा विरोध कर रहे है
महाराष्ट्र मे वर्तमान मे #हिंदुत्व विचारधारा वाली सरकार है . बेहतर होगा फिल्म निर्माता तथा दिग्दर्शक सामने आकार जो आपत्तीजनक बाते साधू संतो
— Ram Kadam (@ramkadam) December 16, 2022