Arvind Kejriwal: కేజ్రీవాల్ కోసం అంబులెన్స్ పంపిన బీజేపీ నాయకుడు.. ఎందుకంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిందితుడుగా ఉన్నారు. మార్చిలో ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయగా, 50 రోజులు తీహార్ జైలులో ఉన్న తర్వాత, ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే, తాను అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. పీఈటీ-సీటీ స్కాన్‌తో సహా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన నేపథ్యంలో మరో ఏడు రోజులు తన మధ్యంతర బెయిల్ పొడగించాలని కోరుతూ కేజ్రీవాల్ మే 26న సుప్రీంకోర్టు ఆశ్రయించారు. అతను జైలులో 7 కిలోల బరువు కోల్పోయాడని మరియు అతని కీటోన్ స్థాయిలు “చాలా ఎక్కువ” ఉన్నాయని పేర్కొన్నాడు.
Read Also: Kejriwal: కేజ్రీవాల్‌కు దొరకని ఉపశమనం.. రేపు జైల్లో సరెండర్
Also Read
- Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
- Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాలు
- Nepal Floods: నేపాల్ ప్రళయంలో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు
- Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
అయితే, ఢిల్లీ సీఎం తీవ్ర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నానని చెప్పడంతో, బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయల్ శనివారం అంబులెన్స్ పంపించడం చర్చనీయాంశంగా మారింది. సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్తున్న అంబులెన్స్‌ని, గోయల్‌ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంబులెన్స్ కేజ్రీవాల్ ఏదైనా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తీసుకువచ్చానని, అక్కడ అతడికి అన్ని పరీక్షలు కేవలం రెండు గంటలలోపు చేయబడతాయని గోయల్ విలేకరులతో అన్నారు. సీఎం కేజ్రీవాల్ తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందితే, నాటకాలు ఆపి తనతో పరీక్షలకు రావాలని కేంద్ర మాజీ మంత్రి అన్నారు. ప్రజల సానుభూతి పొందేందుకు కేజ్రీవాల్ ఆరోగ్య సమస్యలను చూపుతూ ‘డ్రామా’ సృష్టిస్తున్నారని గోయల్ ఆరోపించారు.
దీనికి ముందు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇది మూత్రపిండాల సమస్యలు లేదా క్యాన్సర్ లక్షణం కావచ్చని వైద్యులు చెప్పారని వెల్లడించారు. మే 10న సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు కేజ్రీవాల్‌కి 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏడు దశల పోలింగ్ జూన్ 1తో ముగుస్తుండటంతో, జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లకు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
-
Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
-
India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
-
Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాలు
-
Nepal Floods: నేపాల్ ప్రళయంలో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!