Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
- నేపాల్ రసువా జిల్లాలో భారీ వరదల ప్రభావం.
- 288 మంది భారతీయులు మిస్సింగ్.
- 21 మంది భారతీయులను రక్షించినట్లు కేంద్రం వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్‌లో భోటెకోషి నది విపత్తులో 288 మంది భారతీయులు గల్లంతైనట్లు, 21 మందిని రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) గురువారం తెలిపింది. కైలాస మానస సరోవరన్ యాత్రకు వెళ్లిన యాత్రికులు, త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు గల్లంతైన వారి జాబితాలో ఉన్నారు. వీరిని గుర్తించేందుకు భారత ప్రభుత్వం నేపాల్ అధికారులతో కలిసి ప్రయత్నిస్తోందని చెప్పారు.
విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. త్రిశూలి-1 పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులతో సంబంధాలు తెగిపోయినట్లు వెల్లడించారు. ఈ కార్మికుల కోసం కాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపున్నట్లు తెలిపారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో అక్కడి వారిని సంప్రదించడం సవాలుగా మారినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
Also Read
కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన రెండు బృందాల్లోని 37 మంది, 49 మంది భారతీయుల ఆచూకీ కూడా అందుబాటులో లేదు. వీరు సమ్రాట్ ట్రావెల్స్, ఫ్లై ఎవరెస్ట్ ట్రావెల్స్ ద్వారా వేర్వేరుగా కైలాస యాత్రకు వెళ్లిరు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో 32 మంది భారతీయులు విపత్తు సంభవించిన రుసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. రిచా టూర్స్ ద్వారా వెళ్లిన వివిధ రాష్ట్రాలకు చెందిన 61 మంది, కేరళకు చెందిన 33 మంది భారతీయులు ఆచూకీ కూడా ప్రస్తుతం దొరకలేదు. అయితే, వీరందరని కనుక్కోలేకపోతున్నామని, వారంతా గల్లంతయ్యారని అర్థం కాదని విదేశాంగ శాఖ చెప్పింది. మరోవైపు, తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయులను సురక్షితంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. గురువారం మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న సమాచారం ప్రకారం, ఈ సంఖ్య వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు