BJP: టార్గెట్ 2024 ఎలక్షన్స్.. ఈ రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇంఛార్జులు వీరే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP has appointed in-charges for many states: బీజేపీ 2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తం అవుతోంది. ఇటీవల కేంద్ర మంత్రులతో సమావేశం అయిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2024 ఎన్నికలపై సమాయత్తం కావాలని సూచించారు. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో అతి తక్కువ తేడాతో ఓడిపోయిన 144కు లోక్ సభ స్థానాలపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో వీటిల్లో గెలవాలని ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు బీజేపీ ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో తరుచుగా కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు పర్యటిస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలే.
ఇదిలా ఉంటే బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి రెండేళ్ల ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే కొంతమంది కేంద్రమంత్రులను, ముఖ్యమంత్రులను పలు రాష్ట్రాలకు ఇంఛార్జులుగా నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది బీజేపీ పార్టీ. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, కీలక నేతలకు వివిధ రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్, కేంద్ర మాజీ మంత్రులు ప్రకాశ్ జవదేకర్, మహేశ్ శర్మలకు రాష్ట్రాలను కేటాయించారు.
Also Read
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
Read Also: Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ 2 ఎన్నిసార్లు భారత్ పర్యటనకు వచ్చారో తెలుసా..?
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి పంజాబ్ రాష్ట్ర బాధ్యతలను అప్పగించారు. అలాగే త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ కు హర్యానా బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు ప్రకాష్ జవదేకర్ ను కేరళకు ఇంఛార్జుగా నియమించారు. గతంలో బీహార్ బాధ్యతలు చూసిన పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకు హర్యానా బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. బీజేపీ సీనియర్ నేత ఓం మాథుర్ కి వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఛత్తీస్‌గఢ్ బాధ్యతలు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి బీజేపీ అధికారంలోకి రావాాలని కోరుకుంటోంది.
బీహార్ మాజీ మంత్రి మంగళ్ పాండేకు పశ్చిమ బెంగాల్ బాధ్యతలు అప్పగించింది. పశ్చిమ బెంగాల్ లో మరో బీజేపీ నేత సునీల్ బన్సాల్ తో కలిసి ఆయన ఇంఛార్జి బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో అరుణ్ సింగ్, మధ్యప్రదశ్ లో మురళీధర్ రావులను ఇంఛార్జులుగా బీజేపీ కొనసాగిస్తోంది. లక్ష్మీకాంత్ వాజ్‌పేయి జార్ఖండ్ బాధ్యతలు చూడనున్నారు. త్రిపుర బాధ్యతలను మహేష్ వర్మ చూసుకోనున్నారు. బీజేపీ నేత సంబిత్ పాత్రకు ఈశాన్య రాష్ట్రాల సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने विभिन्न राज्यों के प्रभारी एवं सह-प्रभारी को नियुक्त किया है। pic.twitter.com/Rn4uyB8cmL
— BJP (@BJP4India) September 9, 2022
తాజావార్తలు
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!