Maharashtra: శనివారంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏ పార్టీనో స్పష్టత రానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి చెందిన కీలక నేత ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో చేరారు.