Rahul Gandhi: ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు కావడంతో కాంగ్రెస్ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహారాష్ట్రాలో ఇద్దరు కోటీశ్వరులతో పేద ప్రజలు పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ధారావి మ్యాప్, గౌతమ్ అదానీ, నరేంద్ర మోడీల ఫొటోను ఆయన ఆవిష్కరించారు. అందులో మోడీ అంటే ఇదేనేమో.. ఒకటి ఉంటే మరోకటి సురక్షితం అని ఎద్దేవా చేశారు. ఏక్ హై తో సేఫ్ హై అనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నినాదం అని ఆరోపించారు. ఇక, మహారాష్ట్ర యువత యొక్క ఉద్యోగాలలో కోత పెట్టేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే, వేదాంత ఫాక్స్‌కాన్ యువతకు ఉపాధిని కల్పిస్తుంది.. కానీ దానిని మీ నుంచి దూరం చేశారు.. టాటా ఎయిర్‌బస్ ప్రాజెక్ట్ వేలాది మంది యువతకు ఉపాధిని కల్పించింది.. ఇక్కడి యువత నుంచి మొత్తం 5 లక్షల ఉద్యోగాలు లాక్కుపోయారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Read Also: DK Aruna: సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..?
ఇక, దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, పేదరికం, నిరుద్యోగం సమస్యలు ప్రధానంగా ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. అలాగే, దేశంలో కులగణన అతి పెద్ద సమస్య.. 50% మంది దళితులు, ఆదివాసీలు ఉనప్పటికీ.. వారికి వ్యవస్థలో ఎటువంటి హక్కు లేదన్నారు. మేము దానిని మార్చాలనుకుంటున్నామన్నారు. ఇంకా ఆరోగ్య బీమా, నిరుద్యోగ భృతి, ప్రజలకు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కావాలన్నారు. ఈ ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పలేక ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోంది అని విమర్శలు గుప్పించారు. మా ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతుంది.. అందుకే ఉద్దవ్, శరద్ పవార్ తో కలిసి నిలబడి పోటీలో నిలబడినట్లు రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.