మున్సిపల్ ఎన్నికల వేళ మహారాష్ట్రలో విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో బద్దశత్రువులైన కాంగ్రెస్-బీజేపీ చేతులు కలపడం ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏక్‌నాథ్‌షిండేకు చెందిన శివసేన పార్టీ మీద కోపంతో హస్తం-కమలం నేతలు చేతులు కలిసినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Union Budget: కేంద్ర బడ్జెట్ తేదీపై సందిగ్ధం.. కొత్త అంచనాలు ఇవే!
అంబర్‌నాథ్ మున్సిపల్ ఎన్నికల్లో 60 స్థానాలకు గాను షిండే వర్గం 27 స్థానాలు గెలుచుకుంది. మెజార్టీకి కొంచెం దూరంలోనే ఉంది. ఇంకో నాలుగు స్థానాలు ఉంటే షిండే వర్గానికి పీఠం కైవసం అవుతుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ గట్టి షాకిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో శివసేనకు మేయర్ పీఠం దక్కకూడదన్న ఆలోచనతో బద్ధశత్రువైన హస్తం పార్టీతో చేతులు కలిపింది. ఇక్కడ రెండో స్థానంలో బీజేపీ 14 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ 12, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ 4 స్థానాలు, పలువురు స్వతంత్రులు గెలుచుకున్నారు. దీంతో ఈ మూడు పార్టీలు చేతులు కలిశాయి. అంబర్‌నాథ్ మున్సిపల్‌ను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో అంబర్‌నాథ్ వికాస్ అఘాడి పేరుతో కూటమిగా ఏర్పడింది. ఈ కూటమికి 31 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంది. అంటే మెజార్టీ కంటే ఒక స్థానం ఎక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి: Haryana: మగ బిడ్డ కోసం ఆరాటం.. 10 మంది కుమార్తెల తర్వాత…!
ఈ అంబర్‌నాథ్ మున్సిపల్.. థానే జిల్లాలో ఉంది. ఇది షిండే సొంత జిల్లా. అయితే గత కొన్నేళ్లుగా అంబర్‌నాథ్ మున్సిపల్ అవినీతి, దోపిడీకి గురైందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో శివసేనకు దక్కకూడదన్న ఆలోచనతో బీజేపీ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. అయితే ఈ పొత్తుపై శివసేన వర్గం నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది అసభ్యకరమైన కూటమిగా అభివర్ణించారు. శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినికర్ మాట్లాడుతూ.. బీజేపీ-కాంగ్రెస్ ద్రోహం చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ రహిత దేశం కావాలని వాదించే బీజేపీ… ఇప్పుడు అంబర్‌నాథ్‌లో అధికారం కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం షిండేను కత్తితో పొడిచినట్లేనని వ్యాఖ్యానించారు.