Aditi Arya: కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్, మాజీ మిస్ ఇండియాను పెళ్లి చేసుకోబోతున్నారు. 2015 ఫెమినా మిస్ ఇండియా విజేత అదితి ఆర్యతో ఎంగేజ్మెంట్ అయినట్లు ధ్రువీకరించారు. యేల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తియిన సందర్భంగా ఆమెకు అభినందనలు తెలుపుతూ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ అదితి నాకు కాబోయే భార్య, ఈ రోజు యేల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేసింది. మీ గురించి చాలా గర్వంగా ఉంది.’’ అని జైకొటక్ ట్వీట్ చేశారు.
Read Also: COVID-19: ఇప్పటికీ ప్రతీ 4 నిమిషాలకు ఒకరి ప్రాణం తీస్తున్న కరోనా మహమ్మారి..
అతని పోస్టుకు 7 వేలకు పైగా లైక్స్, 9 లక్షల వ్యూస్ దక్కాయి. వ్యాపారవేత్త హర్ష్ గోయెంకాతో పాటు పలువురు ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది పారిస్ ఈఫిల్ టవర్ ముందు వీరిద్దరు ఫోటోలకు ఫోజు ఇవ్వడంతో వీరిద్దరి వివాహంపై పలు కథనాలు వచ్చాయి. అప్పుడు ఎంగేజ్మెంట్, మ్యారేజ్ విషయాన్ని వీరిద్దరు ధ్రువీకరించలేదు. తాజా క్లారిటీ వచ్చింది.
జే కోటక్ కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. హిస్టరీ, ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. ఆ తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి తన ఎంబీఏను పూర్తి చేశాడు. ప్రస్తుతం కొటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క డిజిటల్ ఫస్ట్ మొబైల్ బ్యాంక్ కొటక్811 కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదితి ఆర్య ఢిల్లీలోని షహీద్ సుఖ్‌దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌లో గ్రాడ్యుయేట్ చేసింది, 2015 అందాల పోటీల 52వ ఎడిషన్ లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. ఆమె కొన్ని హిందీ, తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగులో కళ్యాణ్ రామ్ కు సరసన ‘ఇజం’ సినిమాలో నటించింది. ఆ తరువాత సెవెన్, నిన్ను వదిలి నేను పోలేనులే వంటి సినిమాల్లో నటించింది. హిందీతో పాటు కన్నడ ఇండస్ట్రీలో కూడా యాక్ట్ చేసింది.
Aditi, my fiancée, completed her MBA from Yale University today. Immensely proud of you @AryaAditi pic.twitter.com/xAdcRUFB0C
— Jay Kotak (@jay_kotakone) May 24, 2023