Jay Kotak: ప్రముఖ బిలియనీర్ ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్ మాజీ మిస్ ఇండియా అదితి ఆర్యను వివాహం చేసుకున్నాడు. మంగళవారం ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో అదితి ఆర్య యేల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసుకున్న సమయంలో జై ఆమెను అభినందిస్తూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘‘ నా కాబోయే భార్య అదితి ఈ రోజు యేల్ యూనివర్సిటీలో తన ఎంబీఏ పూర్తి…