12 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి.. బతికే ఉన్నాడని అందిన సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ తాజాగా తెలిసింది. అతడు పాకిస్థాన్ జైలులో బందీగా ఉన్నట్లు సమాచారం అందడంతో సదరు వ్యక్తి కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… బీహార్‌లోని బక్సర్ జిల్లా ఖిలాఫత్‌పూర్‌కు చెందిన ఛావీ అనే వ్యక్తి 12 ఏళ్ల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో అతడి వయసు 18 సంవత్సరాలు. అంతేకాదు అతడి మానసిక స్థితి కూడా సరిగా లేదు. అయితే అతడి కోసం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా… ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో చనిపోయాడని భావించి కర్మకాండలు కూడా నిర్వహించారు.
Read Also: వీడెవడండీ బాబూ… మహిళ అండర్‌వేర్‌ను మాస్క్‌గా పెట్టుకున్న వ్యక్తి
Also Read
- Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
కట్ చేస్తే… తాజాగా ఛావీ బతికే ఉన్నాడని కుటుంబసభ్యులకు స్పెషల్ బ్రాంచీ పోలీసుల నుంచి ఓ లేఖ అందింది. అతడు పాకిస్థాన్ జైలులో బందీగా ఉన్నాడని సదరు లేఖలో పోలీసులు పేర్కొనడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చనిపోయాడనుకున్న కుమారుడు బతికే ఉన్నాడని తెలియడంతో ఛావీ కుటుంసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఛావీ పాకిస్థాన్‌లో ఏ జైలులో ఉన్నాడనే విషయంపై కచ్చితమైన సమాచారం అందాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మతిస్థిమితం లేకపోవడం వల్ల ఛావీ సరిహద్దు దాటి పాకిస్థాన్ బలగాలకు చిక్కి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతడి ఆచూకీని వీలైనంత త్వరగా కనుక్కుని భారత్‌కు తిరిగి రప్పిస్తామని కుటుంబసభ్యులకు పోలీసులు హామీ ఇచ్చారు.

తాజావార్తలు
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!