Bihar Elections: బీహార్ ఇండియా కూటమి సీఎం అభ్యర్థి ప్రకటన.. ఎవరంటే..!
- బీహార్ ఇండియా కూటమి సీఎం అభ్యర్థి ప్రకటన
- అధికారికంగా ప్రకటించిన అశోక్ గెహ్లాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొత్తానికి ఇండియా కూటమిలో నెలకొన్న రాజకీయ సంక్షోభం సమిసిపోయింది. విభేదాలు పక్కన పెట్టి ఐక్యతా రాగం పలికాయి. తాజాగా బీహార్ మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును అధికారికంగా ఇండియా కూటమి పార్టీలు సంయుక్త ప్రెస్‌మీట్ నిర్వహించి ప్రకటించాయి. తేజస్వి యాదవ్‌తో కలిసి అశోక్ గెహ్లోట్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ పేరును అధికారికంగా వెల్లడించారు. ఇక డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేష్ సహానీని ప్రకటించారు.

Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు వరకు ఇండియా కూటమి ఏకంగానే ఉంది. అయితే సీట్ల పంపకాల విషయంలో తేడా రావడంతో చివరి నిమిషంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా విడివిడిగా నామినేషన్లు వేశారు. దీంతో అధికారంలోకి వద్దామనుకున్న కూటమి ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు విపక్ష కూటమి బలహీనతను అధికార కూటమి క్యాష్ చేసుకుంటోంది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. దీంతో కాంగ్రెస్ అప్రమత్తం అయింది. సీనియర్ నాయకుడు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను రంగంలోకి దింపింది. అంతే హుటాహుటినా అశోక్ గెహ్లాట్ పాట్నాలో వాలిపోయారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇంట్లో ఇండియా కూటమి పార్టీలతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ఏక కంఠంతో అంగీకారం తెలిపాయి. దీంతో కూటమిలో నెలకొన్న సంక్షోభం ఒక్కసారిగా పటాపంచలు అయింది. గురువారం అధికారికంగా తేజస్వి యాదవ్ పేరును ప్రకటించారు.
ఇక ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక హామీలు కుమ్మరించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అలాగే జీవికా దీదీలకు నెలకు రూ.30,000 జీతం ఇస్తామని వెల్లడించారు. పర్మినెంట్ చేయడంతో పాటు రుణాలు కూడా ఇస్తామని తెలిపారు.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Modi vs Congress: ట్రంప్‌ను కలవలేకే సదస్సుకు మోడీ దూరం.. కాంగ్రెస్ విమర్శ
#WATCH | #BiharElection2025 | After announcing Tejashwi Yadav as the CM face of Mahagathbandhan, senior Congress leader Ashok Gehlot says, "Naturally, it was going to be Tejashwi's name…Rahul Gandhi and everyone else had his name on their minds…that Tejashwi Yadav will be our… pic.twitter.com/0hgCoTq4ho
— ANI (@ANI) October 23, 2025
#WATCH | #BiharElection2025 | "Tejashwi khud Bihar sarkaar nahi chalaega balki poora Bihar milkar Bihar sarkaar chalane ka kaam karega. Tejashwi CM banega toh saath mein sabhi Bihar ke log CM banenge…" says RJD leader and Mahagathbandhan's CM face, Tejashwi Yadav pic.twitter.com/QTS3Mr4ENh
— ANI (@ANI) October 23, 2025
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!