Bihar Politics: సీఎంగా నితీష్ కుమార్, 19-20 తేదీల్లో ప్రమాణ స్వీకారం..?
- బీహార్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే సిద్ధం..
- మళ్లీ నితీష్ కుమారే సీఎం, ఇప్పటికే క్యాబినెట్ ఫార్ములా పూర్తి..
- 19-20 తేదీల్లో ప్రమాణ స్వీకారం జరిగే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బీహార్‌లో ఘన విజయం తర్వాత ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో క్యాబినెట్ ఫార్ములా కూడా సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని భావిస్తున్నారు.ఎన్డీయే ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం లేదా గురువారం జరుగుతుందని, ఇది ప్రధాని నరేంద్రమోడీ షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
Read Also: Bhagyashri Borse : భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్.. కనికరం చూపని కాంత
Also Read
- CJI Surya kant: సీజేపీ నిరసనల పిటిషన్‌పై సూర్యకాంత్ కీలక ప్రకటన
- Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..
- CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
- Abhijeet Dipke: వాంగ్‌చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
బీహార్ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూల కూటమి సంచలన విజయం సాధించింది. 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకుంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 85 సీట్లు సాధించింది. ఇదిలా ఉంటే, 18వ బీహార్ అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపధ్యంలో నితీష్ కుమార్ రేపు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. 17వ అసెంబ్లీ రద్దును ఈ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీని తర్వాత నితీష్ కుమార్ తన రాజీనామాను గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు సమర్పిస్తారు. దీంతో, తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.
ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు గవర్నర్‌కు సమాచారం ఇవ్వనున్నారు. ప్రధాని మోడీ షెడ్యూల్ ఆధారంగా నవంబర్ 19-20లలో తేదీలను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే, పాట్నాలోని గాంధీ మైదానంలో సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
తాజావార్తలు
-
Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా…
-
CJI Surya kant: సీజేపీ నిరసనల పిటిషన్‌పై సూర్యకాంత్ కీలక ప్రకటన
-
Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..
-
Lothukunta Land Case: లోతుకుంట భూముల కేసులో హైడ్రాకు హైకోర్టు షాక్..
-
Toxic: ‘టాక్సిక్’కి సెన్సార్ కష్టమేనా?
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!