Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం పరిధిలోని మక్కినవారిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. సొసైటీలో నిర్వహించిన ఎరువుల అమ్మకాల్లో ఏకంగా రూ.1.60 కోట్లకు పైగా నిధులు దారిమళ్లినట్లు వెల్లడవడంతో స్థానిక రైతుల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షల్లో సొసైటీ నిధులు గోల్మాల్ కావడంపై దిగ్భ్రాంతి చెందిన రైతులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సొసైటీ కార్యాలయం ఎదుట శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఈ విచారణ ప్రక్రియ సాగుతున్న తీరుపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం సొసైటీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న ఒక చిన్న ఉద్యోగిని మాత్రమే బాధ్యుడిగా చూపుతూ, అసలు అక్రమార్కులు, సూత్రధారులు తప్పించుకునేందుకు పక్కా ప్రణాళికతో కుట్రలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఈ నిధుల దుర్వినియోగం , అవినీతిలో నేరుగా పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందితోనే తిరిగి విచారణ జరిపిస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
అవినీతిపరులే అధికారుల స్థానంలో ఉండి విచారణ జరిపితే బాధ్యులకు శిక్ష పడదని, రైతులకు న్యాయం జరగదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. సహకార శాఖ ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని, ఈ రూ.1.60 కోట్ల స్కామ్‌పై నిష్పాక్షికమైన విచారణ జరిపించాలని కోరారు. తక్షణమే ఉన్నత స్థాయి అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసి, నిధుల గోల్‌మాల్‌కు కారణమైన వారందరినీ చట్టం ముందు నిలబెట్టాలని, రైతుల సొమ్మును రికవరీ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
తాజావార్తలు
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
ట్రెండింగ్
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!