Bangladesh crisis: 1971 తర్వాత భారత్‌కు అతిపెద్ద సవాల్.. “బంగ్లాదేశ్”పై పార్లమెంటరీ ప్యానెల్ రిపోర్ట్..
- 1971 తర్వాత భారత్‌కు అతిపెద్ద సవాల్‌గా బంగ్లాదేశ్..
- శశిథరూర్ నేతృత్వంలోని హౌజ్ ప్యానెల్ సంచలన రిపోర్ట్..
Bangladesh crisis: 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత, ఇప్పుడు భారతదేశానికి వ్యూహాత్మక సవాల్‌గా మారుతోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హెచ్చరించింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ప్యానెల్ బంగ్లాదేశ్‌లో రాజకీయ మార్పులు, చైనా, పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న ప్రభావం, షేక్ హసీనా పదవిని కోల్పోవడం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ సమయంలో భారత్ తన వ్యూహాన్ని పున: సమీక్షించుకోకపోతే, యుద్ధం వల్ల కాదు కానీ , ప్రాధాన్యత కోల్పోవడం వల్లే, ఢాకాలో భారత్ వ్యూహాత్మక ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ హెచ్చరించింది.
Read Also: Omar Abdullah: ఒక ముస్లిం హిందూ మహిళ ముసుగు తీస్తే పరిస్థితి ఏంటి.?
Also Read
- 2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
‘‘1971లో సవాలు మనుగడకు సంబంధించింది, మానవతావాదానికి సంబంధించింది, ఒక కొత్త దేశం ఆవిర్భావానికి సంబంధించింది కాగా, ఇప్పుడు సవాల్ మరింత తీవ్రమైంది. ఇది తరాల మధ్య అంతరాయం, రాజకీయ వ్యవస్థలో మార్పు, భారతదేశం నుంచి దూరంగా ఒక సంభావ్య వ్యూహాత్మక పున:సమీకరణకు సంబంధించింది’’ అని కమిటీ పేర్కొంది. పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు, బంగ్లాలో చైనా పెట్టుబడుల విషయంలో కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మోంగ్లా పోర్ట్, లాల్మోనిర్హాట్ ఎయిర్ బేస్, పెకువాలో జలాంతర్గామి స్థావరం వంటి ప్రాజెక్టులను ఉదహరించింది.
ఇదే కాకుండా, బంగ్లాలోని జమాతే ఇస్లామితో సహా అన్ని వర్గాలను చైనా కలుపుకుపోతోందని చెప్పింది. బంగ్లాలో విదేశీ శక్తులు సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం కఠినంగా పర్యవేక్షించాలని, అభివృద్ధి, కనెక్టివిటీ, ఓడరేవుల యాక్సెస్‌లో బంగ్లాదేశ్‌కు ప్రయోజనాలను అందించాలని ప్యానెల్ సిఫారసు చేసింది. బంగ్లాలో పెరుగుతున్న రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడటాన్ని ప్యానెల్ ఎత్తిచూపింది. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై నిషేధం బంగ్లాదేశ్ భవిష్యత్తులో జరిగే ఏవైనా ఎన్నికలలో అందరినీ కలుపుకునే సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తుందని చెప్పింది.
తాజావార్తలు
-
SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!
-
Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్.. జెట్ స్పీడ్ లో సైలెంట్ గా షూటింగ్
-
Today Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు!
-
Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?