CM MK Stalin: సివిల్ సర్వీస్ అభ్యర్థుల విన్నపాలను పరిగణనలోకి తీసుకొని, వాళ్లకు మరో అవకాశమివ్వాలని ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారని, చివరి అవకాశాన్నీ కోల్పోయిన వారున్నారని అన్నారు. అలాంటి వాళ్ల అభ్యర్థనను స్వీకరించి వయోపరిమితిని పెంచుతూ మరో సారి పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరారు. చివరి అవకాశం కోల్పోయిన అభ్యర్థులందరికీ మరోసారి పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలంటూ..పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ…
పార్లమెంటరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ గుజరాత్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని టీఆర్ఎస్ ఎంపీలు సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇతర సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక మల్ధారిస్ అనే గిరిజనులతో స్టాండింగ్ కమిటీ సభ్యులు మమేకం అయ్యారు. ప్రకృతి నియమాలను గౌరవిస్తే అడవి జంతువులతో కూడా జీవించవచ్చని మల్ధారిస్ గిరిజనుల వద్ద తెలుసుకున్నామని టీఆర్ఎస్…
నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా తీసుకున్నప్పుడే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వాసం మాకు ఉందని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్… హైదరాబాద్‌లో జరిగిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అండ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీల తోపాటు వివిధ పథకాల కింద రావాల్సిన సహాయ సహకారాలను అందించడంలో కేంద్రం శీతకన్ను వేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి దక్కాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్ నుంచి మొదలుకొని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,…