Big Win For AAP In Delhi Municipal Election, Show 2 Exit Polls: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో చీపురు పార్టీ స్వీప్ చేయబోతోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని ఆజ్ తక్, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 7న ఫలితాలు వెల్లడి కానున్నాయి. డీలిమిటేషన్ తర్వాత తొలిసారిగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో 50.47 శాతం ఓటింగ్ నమోదు అయింది. మొత్తం 250 వార్డుల్లో 1349 మంది పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ కి ఎక్కువ సీట్లు వస్తున్నట్లు తేలింది. బీజేపీకి 35 శాతం, ఆప్ కి 43 శాతం, కాంగ్రెస్ పార్టీకి 10 శాతం ఓట్లు రానున్నట్లు వెల్లడించింది. మొత్తం 250 వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) 149-171 స్థానాలు గెలుచుకుంటుందని..బీజేపీ 69-91 స్థానాలు, కాంగ్రెస్ 03-07, ఇతరులు 05-09 స్థానాలను గెలుచుకుంటుందని ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆప్ 146-156 స్థానాల్లో గెలుపొందితే.. బీజేపీ 84-94 స్థానాల్లో గెలుస్తుందని అంచానా వేసింది.
బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు మొత్తం 250 స్థానాలకు తమ అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 247, జేడీయూ 23, ఇండియన్ ముస్లిం లీగ్ 12, బీఎస్పీ 174, ఎంఐఎం 15 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి.
సర్వే సంస్థ – ఆప్ – బీజేపీ
ఆజ్ తక్ 149-171 69-91
టైమ్స్ నౌ 146-156 84-94