Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bhima Koregaon Accused Varavara Rao Moves Supreme Court For Bail

Varavara rao: వరవరరావు బెయిల్ పిటిష‌న్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

Published Date :June 30, 2022 , 3:56 pm
By Mahesh Jakki
Varavara rao: వరవరరావు బెయిల్ పిటిష‌న్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

సామాజిక ఉద్యమకారుడు, కవి వ‌ర‌వ‌ర‌రావు దాఖ‌లు చేసుకున్న బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌కు సుప్రీంకోర్టు అంగీక‌రించింది. వ‌ర‌వ‌ర‌రావు బెయిల్ పిటిష‌న్‌ను గురువారం విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు ఈ పిటిష‌న్‌పై జులై 11న విచార‌ణ చేప‌ట్ట‌నుంది. బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న వ‌ర‌వ‌ర‌రావును మ‌హారాష్ట్ర పోలీసులు చాలా కాలం క్రిత‌మే అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ పలుమార్లు వరవరరావు పిటిషన్లు దాఖలు చేసినా ఆయనకు అనుకూలంగా తీర్పు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో 82 సంవత్సరాల వయసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ఇప్పటి వరకు విచారణ జరపడం లేదని వరవరరావు సుప్రీంకోర్టుకు విన్నవించారు. తాము దాఖలు చేసిన పిటిషన్ త్వరగా విచారణకు తీసుకోవాలని సుప్రీంకోర్టును వరవరరావు తరపున న్యాయవాది ఆనంద్ గ్రోవర్ కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ ప్రస్తావించగా.. విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది.

అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ ఇవ్వాలని వరవరరావు దాఖలు చేసుకున్న పిటిషన్ ను బాంబే హైకోర్టు ఇటీవలే తోసిపుచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాజాగా వరవరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై జులై 11న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. వరవరరావు ప్రస్తుతం పార్కిన్సన్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. .

అసలు నేపథ్యం ఇది: 200 ఏళ్ల కింద జరిగిన బీమా కోరేగావ్ యుద్ధాన్ని స్మరించుకునేందుకు ఎల్గర్ పరిషత్తు నేతృత్వంలో చేసిన ప్రయత్నం చివరికి అల్లర్లకు దారి తీసింది. మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్‌లో 2018 జనవరిలో చోటుచేసుకున్న అల్లర్లలో మావోయిస్టుల కుట్ర ఉందని పుణెలో పోలీసులు కేసు నమోదు చేశారు. 2017 డిసెంబరు 31న ఎల్గార్‌ పరిషద్‌ అనే సంస్థ పుణెలో నిర్వహించిన కార్యక్రమం వెనుకా మావోయిస్టులు ఉన్నారని, ఇక్కడ జరిగిన ప్రసంగాలే మర్నాడు బీమా కోరేగావ్‌ అల్లర్లకు కారణమయ్యాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2018 జూన్‌లో దేశవ్యాప్తంగా ఆరుగుర్ని అరెస్టు చేశారు. ఇందులో ఢిల్లీకి చెందిన పౌరహక్కుల నేతలు రోనా విల్సన్‌, రోనా జాకొబ్‌, దళిత హక్కుల నాయకుడు ఎల్గార్‌ పరిషద్‌కు చెందిన సుధీర్‌ ధవాలె, షోమ సేన్‌, మహేష్‌ రౌత్‌, న్యాయవాది సరేంద్ర గాడ్లింగ్‌లు ఉన్నారు.

Maharashtra Political Crisis: ఫడ్నవీస్, షిండే మధ్య కీలక చర్చలు

Amarnath yatra: నేటి నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bail
  • bail petition
  • Bhima Koregaon
  • Supreme Court
  • Varavara Rao

తాజావార్తలు

  • New Technology: కండోమ్ రంగు మారితే.. వ్యాధి ఉన్నట్లే.. కొత్త టెక్నాలజీ వచ్చేసింది..

  • Vishnu Kumar Raju: ‘ఆల్కహాల్ గన్’ చూపిస్తూ జగన్‌పై విష్ణుకుమార్‌ రాజు హాట్‌ కామెంట్స్..

  • SRH Vs KKR: టాస్ గెలిచిన కోల్‌కత్తా.. SRH బ్యాటింగ్.. 300 రన్స్ లోడింగ్..!

  • Hyderabad: పల్సర్ బైక్‌పై ఐదుగురు యువకుల నిర్లక్ష్య ప్రయాణం.. ఇన్ స్టాలో వైరల్.. చివరకు

  • Strait of Hormuz: హార్ముజ్ తెరవడానికి 35 దేశాలతో చేయి కలిపిన భారత్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions