Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
- ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు
- ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
- బల్గేరియాలోని సోఫియా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ నుంచి వియన్నా వెళ్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు వచ్చింది. బాంబు బెదిరింపు సంకేతం రావడంతో టెల్ అవీవ్ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు వెళ్తున్న ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బల్గేరియాలోని సోఫియా విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమాన సిబ్బంది అప్రమత్తం చేయడంతో అధికారులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. విమానంలో ఉన్న ప్రయాణికులను కిందకు దించి తనిఖీలు ప్రారంభించారు.
ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన OS82 విమానం ఎయిర్‌బస్ A320 రకానికి చెందినది. టెల్ అవీవ్ నుంచి వియన్నాకు ప్రయాణిస్తుండగా రొమేనియా సరిహద్దు సమీపంలో విమాన సిబ్బందికి బాంబు బెదిరింపునకు సంబంధించిన సంకేతం అందినట్లు బల్గేరియా రవాణా, సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యగా విమానాన్ని సోఫియాకు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని సిబ్బంది నిర్ణయించారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్24 సమాచారం ప్రకారం.. విమానం రాత్రి 9.25 గంటలకు (UTC) సోఫియా విమానాశ్రయంలో దిగింది. ఈ విషయాన్ని స్కై న్యూస్ వెల్లడించింది.
Also Read
- Pakistan Tarbela Dam Accident: పాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట కూలి భారీ వరదలు.. చైనా నిర్మాణ సంస్థపై ప్రశ్నలు..!
- Who Is Alice Huang: ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎన్విడియా బాస్‌నే బుట్టలో వేసుకున్న చైనా మిస్టరీ ఉమెన్!
- Pakistan TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు!
- Sheikh Hasina: ‘మరణం రాసి ఉంటే నా దేశంలోనే చనిపోతా’.. కొత్త పాస్‌పోర్ట్, NID కోసం షేక్ హసీనా దరఖాస్తు
ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో మొత్తం 57 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు సిబ్బంది కాగా, 51 మంది ప్రయాణికులు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు తదుపరి భద్రతా చర్యలపై దృష్టి సారించారు. బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే ప్రామాణిక భద్రతా విధానాలను అమలు చేశారు. బల్గేరియా వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం గాల్లోకి ఎగిరి, ప్రయాణికుల విమానానికి తోడుగా ప్రయాణించింది. అనంతరం విమానం సోఫియా విమానాశ్రయంలో సురక్షితంగా దిగే వరకు పర్యవేక్షించింది.
విమానం ల్యాండ్ అయిన తర్వాత అధికారులు ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంబంధిత భద్రతా సంస్థలు విమానంలో తనిఖీలు ప్రారంభించాయి. ప్రయాణికులను విమానం నుంచి కిందకు దించారు. అయితే బాంబు బెదిరింపునకు సంబంధించిన అసలు వివరాలు ఏమిటి? విమానంలో ఏదైనా అనుమానాస్పద వస్తువు గుర్తించారా? అనే అంశాలపై అధికారులు ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం వెల్లడించలేదు. తనిఖీల్లో ఏం తేలిందన్నది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!