Shafali Verma: రాత్రంతా నిద్రపోలేదు.. దాని గురించే ఆలోచించా.. షఫాలీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shafali Verma Reveals Sleepless Night: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ తన బ్యాటింగ్ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసింది. తాను అనుకున్న షాట్లు ఆడగలుగుతున్నానని, మైదానంలో అనుకున్నది అమలు చేయగలగడం ఆనందంగా ఉందని తెలిపింది. జింబాబ్వే కెప్టెన్ తన బ్యాటింగ్‌ను అద్భుతమైన ప్రదర్శనగా అభివర్ణించడంపై స్పందిస్తూ.. తన ఆటతీరుతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. రాయ్‌పుర్ వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా జింబాబ్వే 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేయగా.. భారత్ 8.5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. షఫాలీ 25 బంతుల్లో 55 రన్స్ చేసింది.
భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన షఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా షఫాలీ మాట్లాడుతూ.. ‘గత మ్యాచ్‌లో ఔటైన తీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ మ్యాచ్ తర్వాత రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆ నిరాశలోనే ఉండిపోకుండా. తర్వాతి మ్యాచ్‌లో ఏం చేయాలనే దానిపై ఆలోచించా. నా మనసును అదుపులో ఉంచుకుని, మరుసటి రోజు ఎలా ఆడాలనే విషయాన్ని ఆలోచిస్తూ సిద్ధమయ్యా. గత మ్యాచ్‌లో స్పిన్నర్ బౌలింగ్‌లో ఔటైన తీరును విశ్లేషించుకున్నా. ముఖ్యంగా కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆ బంతిని ఎదుర్కొన్న విధానం సరైనది కాదని అర్ధమైంది. అందుకే స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు కొంచెం వంగి ఆడుతూ, బంతిని బలంగా కొట్టడం కంటే సరైన టైమింగ్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా’ అని వివరించింది.
Also Read
- Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
- Babar Azam: బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డ్ సేఫ్..
- Cheteshwar Pujara: వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే.. న్యూజిలాండ్ సిరీస్‌లో కష్టమే..
- Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
‘ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ఆలోచనకు బదులుగా, అవసరమైనప్పుడు సింగిల్స్ తీసుకుంటూ ఇన్నింగ్స్‌ను నిర్మించడంపై దృష్టి పెడుతున్నా. నా మనసులో అనుకున్న ప్రణాళికను ఒక్కో దశలో అమలు చేస్తూ ముందుకు సాగుతున్నా. ఆటలో సరళమైన విధానాన్ని అనుసరించడం నాకు ఉపయోగపడుతోంది. ఈ ఇన్నింగ్స్‌లో ఆడిన కవర్ డ్రైవ్ నాకు అత్యంత ఇష్టమైన షాట్లలో ఒకటి. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆడిన ఆ షాట్ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ షాట్ తర్వాత నా ఆటపై మరింత నమ్మకం ఏర్పడింది’ అని షఫాలీ వర్మ వివరించింది.
2025లో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తన ఆటతీరును విశ్లేషించుకున్నానని షఫాలీ వర్మ తెలిపింది. అప్పట్లో తనలో మెరుగుపరుచుకోవాల్సిన అంశాల గురించి ఆలోచించగా, ముందుగా నిలకడ సాధించడం ముఖ్యమని గుర్తించినట్లు చెప్పింది. జట్టు కోసం నిలకడగా పరుగులు చేయడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నానని వెల్లడించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆడే విధానాన్ని కూడా పరిశీలించినట్లు పేర్కొంది. వారు పరిస్థితులకు అనుగుణంగా ఎలా బ్యాటింగ్ చేస్తారు, పరుగులు ఎలా సాధిస్తారు అనే విషయాలను గమనిస్తూ తన ఆటలో మార్పులు చేసుకునేందుకు ప్రయత్నించానని తెలిపింది. జట్టు కోసం మరిన్ని పరుగులు సాధిస్తూ విజయాల్లో భాగం కావాలనుకుంటున్నానని షఫాలీ చెప్పింది.
తాజావార్తలు
-
Shafali Verma: రాత్రంతా నిద్రపోలేదు.. దాని గురించే ఆలోచించా.. షఫాలీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
-
CJP 2.0: సీజేపీ నెక్స్ట్ మూవ్ ఏంటి..? అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
-
Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!