Balasaheb Thackeray: భారత ప్రభుత్వం ఈ రోజు మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌కి అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదుగురికి భారతరత్నలను ప్రకటించింది. ఇదిలా ఉంటే, పలు పార్టీలు తమ నేతలకు కూడా భారతరత్నలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటికే, యూపీ మాజీ సీఎం, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత మాయావతి కాన్షిరామ్‌కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసింది. తాజాగా మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, బాలా సాహెబ్ ఠాక్రేకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో ప్రముఖ కార్టూనిస్ట్‌గా దేశవ్యాప్తంగా హిందువులందరికీ గర్వాన్ని తీసుకువచ్చిన నాయకకుడిగా బాల్ ఠాక్రే భారతరత్నకి అర్హుడని ఆయన ట్వీట్ చేశారు.
Read Also: Bhatti Vikramarka: పీవీ నరసింహారావుకి భారత రత్న ప్రకటించడంపై మండలిలో తీర్మానం..
శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ కూడా బాలా సాహెబ్ ఠాక్రేకి భారతరత్నని డిమాండ్ చేశారు. హిందుత్వమని చెప్పుకుని మోడీ ప్రభుత్వం మరోసారి బాలాసాహెబ్‌ని మరిచిపోయిందని, ఐదుగురు నేతల్ని భారతరత్నతో సత్కరించిందని, వీరిలో వీర్ సావార్కర్, బాలా సాహెబ్ ఠాక్రేలు లేరని ఆయన విమర్శించారు. నిజానికి ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ప్రదానం చేయవచ్చనేది ఒక రూల్ అని, కానీ నెలలోలనే ప్రధాని మోడీ 5 మందికి భారతరత్న ప్రకటించారని, ఇది ఎన్నికల ప్రచారం కాకుంటే మరేంటి..? అని ప్రశ్నించారు. కర్పూరి ఠాకూర్, ఎల్‌కే అద్వానీల తర్వాత చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న పురస్కారం లభించింది, మరికొందరు నేతలు ఎదురుచూస్తున్నారు. బాల్ ఠాక్రేని ఎందుకు మరిచిపోతున్నారని సంజయ్ రౌత్ మండిపడ్డారు.
हिंदुत्ववादी म्हणवून घेणाऱ्या मोदी सरकारला पुन्हा एकदा हिंदूहृदयसम्राट बाळासाहेब ठाकरे यांचे विस्मरण झाले…आधी 2 आणि आता एकदम 3 असे एका महिन्यात 5 नेत्यांना भारतरत्न ने सन्मानित करण्यात आले…पण त्यात ना वीर सावरकर ना शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे!
खरं तर नियम असा आहे की एका… pic.twitter.com/3ZBq5uo115— Sanjay Raut (@rautsanjay61) February 9, 2024
Former Prime Minister P. V. Narasimha Rao, Chaudhary Charan Singh, and S. Swaminathan, father of the Indian Green Revolution, were posthumously awarded Bharat Ratna. S. Swaminathan passed away just a few months ago. A scientist who achieved so much should have received this… pic.twitter.com/5lTR5H69wR
— Raj Thackeray (@RajThackeray) February 9, 2024