Annamalai: బీజేపీ నేత కే.అన్నామలై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేపై తీవ్రంగా స్పందించారు. ఠాక్రేల బెదిరింపులు తనను ముంబై రాకుండా అడ్డుకోలేవని సోమవారం అన్నారు. ఇటీవల, ముంబైలో శివసేన-ఎఎన్ఎస్ ర్యాలీలో అన్నామలైని ఎగతాళి చేస్తూ ఠాక్రేలు బెదిరించే వ్యాఖ్యలు చేశారు.
Maharashtra: మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో విభేదాలు కనిపిస్తున్నాయి. తాజాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించారు.
Raj Thackeray: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ మహా వికాస్ అఘాడి (MVA), రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) నాయకులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు
Raj Thackeray: 13 సంవత్సరాలలో మొదటిసారిగా, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే నివాసం అయిన మాతోశ్రీకి వెళ్లారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజును సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్ ఠాక్రే చివరిసారిగా 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణించిన సమయంలో మాతోశ్రీలోకి ప్రవేశించారు.
మహారాష్ట్రలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మరాఠీ భాష మాట్లాడలేదన్న కారణంతో ఆటో డ్రైవర్‌పై కొందరు భౌతికదాడికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Devendra Fadnavis: దాదాపు 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు తమ విభేదాలను మరిచిపోయి కలుసుకున్నారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేలు శనివారం ఒకే వేదికను పంచుకున్నారు. వీరిద్దరు చివరిసారిగా 2005లో ఒకే వేదికపై కలిశారు. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్‌ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. అయితే, ఇప్పుడు వీరిద్దరిని ‘‘మరాఠీ’’ భాష కలిపింది. ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీని మూడో…
Uddhav Thackeray: శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే శనివారం తన విడిపోయిన బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌ఠాక్రేతో 20 ఏళ్ల తర్వాత మొదటిసారిగా వేదిక పంచుకున్నారు. ఉప్పునిప్పులా ఉండే వీరిద్దరు తమ విభేదాలను పక్కన పెట్టి కలిశారు. ‘‘మేము కలిసి వచ్చాము, కలిసి ఉంటాము’’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
Maharashtra: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలు, హిందీ వివాదంపై తమిళనాడు, కర్ణాటక తర్వాత మహారాష్ట్రలోని పొలిటికల్ పార్టీలు కూడా ఈ వివాదంలో చేరాయి. మహారాష్ట్రంలో హిందీ వివాదం నేపథ్యంలో ఠాక్రే కుటుంబాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మళ్లీ కలిసిపోయేందుకు మార్గం సుగమం అయింది. మరాఠీ గుర్తింపు, సంస్కృతికి ముప్పు ఉందనే ఆందోళనల మధ్య విడిపోయిన ఇద్దరు నేతలు నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.
రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. రావు రమేష్ సరసన ఇంద్రజ. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. సుకుమార్ సతీమణి తబిత తొలిసారి సమర్పకురాలిగా వ్యవహరించడం ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’తో మొదలు కావడం విశేషం.…
Balasaheb Thackeray: భారత ప్రభుత్వం ఈ రోజు మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కి అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదుగురికి భారతరత్నలను ప్రకటించింది. ఇదిలా ఉంటే, పలు పార్టీలు తమ నేతలకు కూడా భారతరత్నలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.