Balasaheb Thackeray: భారత ప్రభుత్వం ఈ రోజు మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌కి అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదుగురికి భారతరత్నలను ప్రకటించింది. ఇదిలా ఉంటే, పలు పార్టీలు తమ నేతలకు కూడా భారతరత్నలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.