Bhagavad Gita Controversy: పోలీస్ ట్రైనింగ్లో భగవద్గీత పఠనం.. మధ్యప్రదేశ్లో వివాదం..
- మధ్యప్రదేశ్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో భగవద్గీత పఠనం..
- రాత్రి మెడిటేషన్ సెషన్ కు ముందు భగవద్గీత చదవాలని ఆదేశాలు..
- పోలీస్ శాఖ ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టిన కాంగ్రెస్ పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagavad Gita Controversy: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ట్రైనింగ్ అకాడమీల్లో భగవద్గీత అధ్యాయాల పఠనం తప్పనిసరి చేయాలని జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు రాజకీయ వివాదానికి దారి తీసింది. రాష్ట్ర పోలీస్ ట్రైనింగ్ విభాగం తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌లో, ప్రతి రోజు రాత్రి ధ్యానానికి ముందు శిక్షణార్థులు భగవద్గీతలోని ఒక అధ్యాయం చదవాలని సూచించింది. ఈ ఆదేశాలని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) రాజా బాబు సింగ్ జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవద్గీత చదవడం వల్ల పోలీస్ ట్రైనింగ్ తీసుకునే వారు నీతి, ధర్మబద్ధతతో జీవించడం నేర్చుకుంటారని పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy : కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు..!
Also Read
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ సర్క్యులర్‌లని తీవ్రంగా తప్పబట్టింది. ఇది మతపరమైన ప్రేరేపణగా ఆరోపించింది. కాషాయీకరణగా ప్రయత్నమని, రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. మరోవైపు, అధికార పార్టీ అయిన బీజేపీ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. భగవద్గీతలోని విలువలను పోలీస్ ట్రైనింగ్ లో పాటించడం వల్ల పోలీసుల్లో నైతికత పెరుగుతుందని వ్యాఖ్యానించారు.
Read Also: MS Dhoni: ధోని ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఐపీఎల్లో ఆడటంపై క్లారిటీ
కాగా, గతంలో కూడా ఏడీజీపీ రాజా బాబు సింగ్ పోలీస్ శిక్షణ సంస్థల్లో తులసీదాస్ రామచరితమానస్ శ్లోకాలను పఠించమని ప్రోత్సహించారు. ఆయన గ్వాలియర్ రేంజ్ ఏడీజీపీగా ఉన్న సమయంలో జైళ్లలోని ఖైదీలకు భగవద్గీత గీతా పుస్తకాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, రాజా బాబు ఇచ్చిన ఆదేశాలతో మతం, ప్రభుత్వ వ్యవస్థ, నైతికతల మధ్య సమతుల్యంపై మరోసారి చర్చ కొనసాగుతుంది.
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?