BCCI Review: గంభీర్ భవితవ్యంపై బీసీసీఐ సమీక్ష.. షాకింగ్ నిర్ణయాలు ఏమైనా ఉంటాయా?
- భారత క్రికెట్లో కీలక పరిణామాలు
- ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది పనితీరుపై సమీక్ష
- గౌతమ్ గంభీర్ భవితవ్యంపై కూడా చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఈ ఘోర పరాజయాల తర్వాత భారత క్రికెట్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా రెండో టీ20 సిరీస్‌ను కోల్పోవడంతో ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది పనితీరుపై కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవితవ్యంపై కూడా చర్చ జరుగుతోందని బీసీసీఐ వర్గాల సమాచారం.
బీసీసీఐతో గౌతమ్ గంభీర్ ఒప్పందం 2027 వరకు ఉంది. అయితే ఇటీవలి ఫలితాల నేపథ్యంలో ఆయన కోచింగ్‌పై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ నాలుగో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓడి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపిక, జట్టు కాంబినేషన్, వ్యూహాలపై బోర్డు సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన భారత్‌కు ఇది వరుసగా రెండో టీ20 సిరీస్ పరాజయం. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ చేతిలో కూడా భారత్ 2-0తో సిరీస్‌ను కోల్పోయింది. ఐర్లాండ్‌పై భారత జట్టు తొలిసారి సిరీస్ ఓడిపోవడం అప్పుడే విమర్శలకు దారితీయగా.. ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో కూడా సిరీస్ కోల్పోవడంతో ఒత్తిడి మరింత పెరిగింది.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
2026 టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను సారథిగా నియమించిన తర్వాత భారత్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. కొత్త కెప్టెన్సీ, కొత్త కాంబినేషన్లు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయాలపై కూడా సమీక్ష చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ ఓటమి తర్వాత హెడ్ కోచ్ భవితవ్యంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిర్వహించే సమీక్షలో జట్టు భవిష్యత్ వ్యూహాలు, కోచింగ్ వ్యవస్థ, ఆటగాళ్ల ఎంపిక వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చూడాలి మరి బీసీసీఐ ఏమైనా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుందో.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..