మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. కొన్ని రకాల పండ్లు తింటే ఇది సమృద్ధిగా లభిస్తుంది. అవేంటో చూద్దాం..
పుచ్చకాయల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల పుచ్చకాయలను తింటే సుమారుగా 0.4 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది.
దానిమ్మ పండ్లలోనూ ఐరన్ సమృద్ధిగానే ఉంటుంది. 100 గ్రాములకు సుమారుగా 0.3 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది.
ఈ పండ్ల ద్వారా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.
100 గ్రాముల మల్‌బెర్రీ పండ్ల ద్వారా సుమారుగా 2.6 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది.
100 గ్రాముల ఖర్జూరాలను తింటే 0.9 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది.
100 గ్రాముల కిస్మిస్‌లను తినడం వల్ల సుమారుగా 1.9 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది. రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తింటే మంచిది.
అంజీర్ పండ్లను తినడం వల్ల కూడా ఐరన్‌ను పొందవచ్చు.100 గ్రాముల అంజీర్లలో 0.2 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది.
కాగా.. 100 గ్రాముల యాప్రికాట్‌లను తింటే సుమారుగా 2.7 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది.